లంచాలు తీసుకోవడంలో రికార్డ్ బ్రేక్ చేస్తున్న అధికారులు.. సీఎస్ ఏం చేశారంటే.?
దిశ, తెలంగాణ బ్యూరో : అవినీతికి పాల్పడబోమని, లంచాలు తీసుకోబోమని సచివాలయ సిబ్బంది మంగళవారం ప్రతిజ్ఞ చేశారు. నైతిక విలువలను పాటిస్తూ ఆదర్శంగా ఉంటామని సిబ్బంది చేత సీఎస్సోమేశ్ కుమార్ సచివాలయంలో ఈ ప్రతిజ్ఞ చేయించారు. అవినీతి నిర్మూలనలో ప్రభుత్వ సిబ్బందిగా తామంతా భాగస్వాములమవుతామని, లంచాలు ఇవ్వబోం, లంచాలను తీసుకోబోమని, నైతిక విలువలు పాటిస్తూ ఆదర్శంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. నీతి, నిజాయితీతో ఉంటూ పారదర్శకంగా ఉంటామని, జవాబుదారీతనంతో వ్యవహరిస్తామన్నారు. చట్ట ప్రకారం నిబంధనలకు అనుగుణంగా విధులు […]
దిశ, తెలంగాణ బ్యూరో : అవినీతికి పాల్పడబోమని, లంచాలు తీసుకోబోమని సచివాలయ సిబ్బంది మంగళవారం ప్రతిజ్ఞ చేశారు. నైతిక విలువలను పాటిస్తూ ఆదర్శంగా ఉంటామని సిబ్బంది చేత సీఎస్సోమేశ్ కుమార్ సచివాలయంలో ఈ ప్రతిజ్ఞ చేయించారు. అవినీతి నిర్మూలనలో ప్రభుత్వ సిబ్బందిగా తామంతా భాగస్వాములమవుతామని, లంచాలు ఇవ్వబోం, లంచాలను తీసుకోబోమని, నైతిక విలువలు పాటిస్తూ ఆదర్శంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. నీతి, నిజాయితీతో ఉంటూ పారదర్శకంగా ఉంటామని, జవాబుదారీతనంతో వ్యవహరిస్తామన్నారు. చట్ట ప్రకారం నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వహిస్తామన్నారు. విజిలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లోభాగంగా సిబ్బంది చేత సీఎస్ ప్రతిజ్ఞ చేయించారు.
పెచ్చుమీరుతున్న అవినీతి..
రాష్ట్రంలో అవినీతి పెచ్చుమీరిపోతున్నదని తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రతీ ఏటా జరిగే విజిలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో భాగంగా ఈ ప్రతిజ్ఞ చేయడం గమనార్హం. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ వేదికగా రెవెన్యూ శాఖలో అవినీతి పెరిగిపోతున్నదంటూ వ్యాఖ్యానించారు. రోజువారీ కార్యకలాపాల్లో సైతం లంచం ఇవ్వనిదే పనులు జరగడంలేదని ప్రజలు మొత్తుకుంటున్నారు. పోలీసు, రెవెన్యూ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ తదితర అనేక ప్రభుత్వ విభాగాల్లో లంచాలు తీసుకోవడం షరా మామూలుగా మారింది.
కొత్తగా నర్సు కొలువులో చేరినవారికి కూడా లంచం ఇవ్వకపోతే పే స్లిప్స్ తయారుచేయబోమని, పే అండ్ అకౌంట్స్ ఆఫీసుకు పంపబోమని క్లరికల్ స్టాఫ్ కరాఖండిగా చెప్పారు. దీంతో వారికి మూడు నెలలుగా జీతాలే అందడంలేదు. ప్రతీ నిత్యం అవినీతి నిరోధక శాఖ అధికారులు పదుల సంఖ్యలో ప్రభుత్వ సిబ్బంది లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాన కార్యదర్శి సచివాలయంలో ప్రభుత్వ సిబ్బంది ద్వారా ప్రతిజ్ఞ చేయించడం మొక్కుబడి చర్యగా మిగిలిపోతుందా.? లేక ఆచరణలో అమలవుతుందా అనేదానికి కాలమే సమాధానం చెప్తుంది.