షాకింగ్ : బయటపడ్డ ‘ఎర్రకోట టు ఢిల్లీ అసెంబ్లీ’ సొరంగం
దిశ, వెబ్‌డెస్క్ : దేశరాజధాని ఢిల్లీలో అరుదైన సొరంగ నిర్మాణం బయటపడింది. సొరంగం ముఖద్వారాన్ని కనుగొన్నట్టు ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయెల్ తెలిపారు. ఈ సొరంగ నిర్మాణాన్ని పరిశీలించగా.. ఢిల్లీ అసెంబ్లీ నుంచి ఈ మార్గం నేరుగా ఎర్రకోటను కలుపుతున్నట్టు గుర్తించారు. స్వాతంత్ర్య సమరయోధుల నుంచి తప్పించుకునేందుకు ఆనాడు బ్రిటీషర్లు ఈ సొరంగ మార్గాన్ని ఉపయోగించినట్టు సమాచారం. అయితే, ఈ నిర్మాణంపై నుంచి మెట్రోపిల్లర్లు, డ్రైనేజీ కాల్వలు ఉండటంతో సొరంగాన్ని మరింత తవ్వేందుకు వీలు […]
దిశ, వెబ్‌డెస్క్ : దేశరాజధాని ఢిల్లీలో అరుదైన సొరంగ నిర్మాణం బయటపడింది. సొరంగం ముఖద్వారాన్ని కనుగొన్నట్టు ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయెల్ తెలిపారు. ఈ సొరంగ నిర్మాణాన్ని పరిశీలించగా.. ఢిల్లీ అసెంబ్లీ నుంచి ఈ మార్గం నేరుగా ఎర్రకోటను కలుపుతున్నట్టు గుర్తించారు. స్వాతంత్ర్య సమరయోధుల నుంచి తప్పించుకునేందుకు ఆనాడు బ్రిటీషర్లు ఈ సొరంగ మార్గాన్ని ఉపయోగించినట్టు సమాచారం. అయితే, ఈ నిర్మాణంపై నుంచి మెట్రోపిల్లర్లు, డ్రైనేజీ కాల్వలు ఉండటంతో సొరంగాన్ని మరింత తవ్వేందుకు వీలు కాదని స్పీకర్ వెల్లడించారు.