హుజురాబాద్‌లో సీక్రెట్ ఆపరేషన్.. ఓటర్లే టార్గెట్.?

దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఎన్నికల నగారా మోగిన తరువాత రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. ఓ వైపున ప్రచారం కొనసాగిస్తూనే మరో వైపున అంతర్గత శత్రువులపై దృష్టి సారించారు. ఉప ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా పావులు కదుపుతున్న ఆయా పార్టీలు ఇతర పార్టీల్లో జరుగుతున్న ఎత్తుగడలను తెలుసుకునే పనిలో పడ్డాయి. ఉత్కంఠంగా మారిన ఈ ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు తమ నీడను కూడా నమ్ముకునే స్థితిలో లేకుండా పోయింది. దీంతో సీక్రెట్ ఆపరేషన్ […]

Update: 2021-09-30 23:08 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఎన్నికల నగారా మోగిన తరువాత రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. ఓ వైపున ప్రచారం కొనసాగిస్తూనే మరో వైపున అంతర్గత శత్రువులపై దృష్టి సారించారు. ఉప ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా పావులు కదుపుతున్న ఆయా పార్టీలు ఇతర పార్టీల్లో జరుగుతున్న ఎత్తుగడలను తెలుసుకునే పనిలో పడ్డాయి. ఉత్కంఠంగా మారిన ఈ ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు తమ నీడను కూడా నమ్ముకునే స్థితిలో లేకుండా పోయింది.

దీంతో సీక్రెట్ ఆపరేషన్ స్టార్ట్ చేసినట్టుగా సమాచారం. కొంతమందిని ఇందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న పార్టీలు గ్రామాల వారీగా.. తమ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న వారు ఎవరు.?, ప్రత్యర్థి పార్టీకి అనుకూలంగా ఉన్నది ఎవరనే విషయం తెలుసుకునే పనిలో నిమగ్నమైనట్టు విశ్వసనీయంగా తెలిసింది. సీక్రెట్ ఏజెంట్లు సాదాసీదాగానే ఆయా పార్టీల కార్యక్రమాల్లో తిరుగుతూ ఎప్పటికప్పుడు సంబంధిత నాయకులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.

అంటీముట్టనట్టుగా..

ఆయా రాజకీయ పార్టీలు కోవర్టుల గురించి డాటా సేకరించి వారితో అంటీముట్టనట్టుగా వ్యవహరించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. రహస్యంగా జరిపే మంతనాలు, ఓటర్లను తమకు అనుకూలంగా మల్చుకునే ఎత్తుగడల గురించి అలాంటి వారికి తెలియనివ్వకుండా జాగ్రత్త పడనున్నట్టుగా సమాచారం.

నిను వీడని నీడను నేనే..

కోవర్టు ఆపరేషన్ విషయంలో ప్రధాన పార్టీల్లో కొంత గందరగోళం నెలకొన్నట్టుగానే ఉంది. పైకి గుంభనంగా వ్యవహరిస్తున్న నాయకులు.. అంతర్గతంగా మాత్రం తమ వైపు నుండి నిఘాను పెంచారనే చెప్పాలి. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ఇక నుండి మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని భావిస్తున్నట్టుగా అర్థం అవుతోంది. ఓటు బ్యాంకు ఉన్న నాయకులతో పాటు ఇతరాత్ర విషయాలు ప్రత్యర్థి పార్టీకి చేరితే ఆ పార్టీ నాయకులు వేసే ఎత్తుగడలతో తమ పార్టీకి నష్టం వాటిల్లుతుందని ముందు జాగ్రత్త చర్యలకు శ్రీకారం చుట్టారు.

 

Tags:    

Similar News