తమిళనాడులో రెండో రాజధాని రగడ

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు రాజకీయాల్లో రెండో రాజధాని రగడ రాజుకుంటుంది. ఇదే అంశం రాష్ట్రంలో వివాదంగా మారుతోంది. మదురైని రెండో రాజధానిగా ప్రకటించాలని డిమాండ్లు ఊపందుకుంటున్న సమయంలో.. రెండో రాజధానిపై మంత్రులు ఉదయ్, సెల్లూర్ రాజ్ తీర్మానం చేయడం చర్చనీయాంశంగా మారింది. కాగా, మాజీ సీఎం ఎంజీఆర్ ఆశయాలకు అనుగుణంగా‘తిరుచ్చి’ని రెండో రాజధానిగా ప్రకటించాలంటూ మంత్రి నటరాజన్ డిమాండ్ చేయడం గమనార్హం. మదురైలో నీటి వసతి లేదని అందుకే ‘తిరుచ్చి’ని ప్రకటించాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ […]

Update: 2020-08-19 23:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు రాజకీయాల్లో రెండో రాజధాని రగడ రాజుకుంటుంది. ఇదే అంశం రాష్ట్రంలో వివాదంగా మారుతోంది. మదురైని రెండో రాజధానిగా ప్రకటించాలని డిమాండ్లు ఊపందుకుంటున్న సమయంలో.. రెండో రాజధానిపై మంత్రులు ఉదయ్, సెల్లూర్ రాజ్ తీర్మానం చేయడం చర్చనీయాంశంగా మారింది.

కాగా, మాజీ సీఎం ఎంజీఆర్ ఆశయాలకు అనుగుణంగా‘తిరుచ్చి’ని రెండో రాజధానిగా ప్రకటించాలంటూ మంత్రి నటరాజన్ డిమాండ్ చేయడం గమనార్హం. మదురైలో నీటి వసతి లేదని అందుకే ‘తిరుచ్చి’ని ప్రకటించాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం 10 జిల్లాల ముఖ్య నేతలు, వ్యాపార వేత్తలు కీలక సమావేశం కానున్నట్లు సమాచారం. మరో 8 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో రాజధాని వ్యవహారం మరింత ఉత్కంఠ భరితంగా మారింది.

Tags:    

Similar News