నిమ్మగడ్డపై దాడులకు అవకాశం.. రంగంలోకి కేంద్రహోంశాఖ
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు కేంద్ర హోంశాఖ భద్రతను పెంచింది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో తనకు భద్రతను పెంచాలని కేంద్రానికి ఎస్‌ఈసీ విజ్ఞప్తి చేశారు. దీంతో నిమ్మగడ్డకు ఏఎస్‌ఐ, నలుగురు సిబ్బందితో పాటు ఎస్కార్ట్ వాహనాన్ని కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసింది. ఇదిలాఉండగా, స్థానిక ఎన్నికల నిర్వహణకు సహకరించాలని ఎన్నిమార్లు కోరినా అందుకు వైసీపీ ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. దానికి తోడు ఏపీ హైకోర్టు, […]
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు కేంద్ర హోంశాఖ భద్రతను పెంచింది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో తనకు భద్రతను పెంచాలని కేంద్రానికి ఎస్‌ఈసీ విజ్ఞప్తి చేశారు. దీంతో నిమ్మగడ్డకు ఏఎస్‌ఐ, నలుగురు సిబ్బందితో పాటు ఎస్కార్ట్ వాహనాన్ని కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసింది. ఇదిలాఉండగా, స్థానిక ఎన్నికల నిర్వహణకు సహకరించాలని ఎన్నిమార్లు కోరినా అందుకు వైసీపీ ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది.
దానికి తోడు ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టు సైతం ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేయడంతో ఈ తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని ప్రతిపక్ష టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఎన్నికల తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రావడంతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డపై దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు తేలడంతో ఆయన రిక్వెస్ట్ మేరకు కేంద్ర హోంశాఖ సెక్యూరిటీని పెంచినట్లు సమాచారం.