'వేతనాల్లో కోతలు ఉపసంహరించుకోవాలి'

దిశ, హైదరాబాద్ : కరోనా వ్యాధిని అరికట్టేందుకు ఆర్థికంగా నిధులు సమకూర్చుకోవడంలో భాగంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 50 శాతం, కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల్లో 10 శాతం కోత విధించడాన్ని సీఐటీయూ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ అధ్యక్షులు కె.ఈశ్వర్ రావు, కార్యదర్శి ఎం.వెంకటేష్ ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ఉద్యోగుల జీతాల్లో కోతలు విధించకుండా నిధుల సమీకరణ కోసం ప్రత్యామ్నాయం మార్గాలు చూడాలన్నారు. కేవలం 10 రోజులకే ప్రభుత్వం ఇలాంటి […]

Update: 2020-03-31 08:21 GMT

దిశ, హైదరాబాద్ :

కరోనా వ్యాధిని అరికట్టేందుకు ఆర్థికంగా నిధులు సమకూర్చుకోవడంలో భాగంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 50 శాతం, కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల్లో 10 శాతం కోత విధించడాన్ని సీఐటీయూ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ అధ్యక్షులు కె.ఈశ్వర్ రావు, కార్యదర్శి ఎం.వెంకటేష్ ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ఉద్యోగుల జీతాల్లో కోతలు విధించకుండా నిధుల సమీకరణ కోసం ప్రత్యామ్నాయం మార్గాలు చూడాలన్నారు. కేవలం 10 రోజులకే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే చైనా లాగా రెండు నెలలు లాక్ డౌన్ అయితే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఉన్నత వర్గాలు, కార్పొరేట్ సంస్థలు, పెట్టుబడిదారులు, వ్యాపార సంస్థలపై పన్నులు పెంచి.. పేదలు, అసంఘటిత కార్మికులు, వలస కార్మికులకు సహాయం చేయాలని సూచించారు. ప్రయివేటురంగ ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులకు వేతనాల్లో ఎలాంటి కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

Tags: Corona, CITU, Celery Cut, CM KCR

Tags:    

Similar News