నేటి నుంచి స్కూళ్లు ప్రారంభం

దిశ, వెబ్‎డెస్క్: ఏపీలో నేటీ నుంచి స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం కానున్నాయి. కరోనా వ్యాప్తి దృష్ట్యా మూతపడిన స్కూళ్లు, కాలేజీలు తెరుచుకుంటున్నాయి. ఈ నెల 2వ తేదీ నుంచి ఏపీలో స్కూళ్లను రీ-ఓపెన్ అయ్యాయి. ముందుగా 9, 10 తరగతులు ప్రారంభించి.. దశల వారీగా క్లాసులను రీ-ఓపెన్ చేయాలని షెడ్యూల్ ఖరారు చేసింది. దీంతో నేటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు తరగతులు నిర్వహించనుంది. 8, 9 తరగతుల విద్యార్థులు రోజు విడిచి రోజు పాఠశాలకు హాజరు […]

Update: 2020-11-22 21:06 GMT

దిశ, వెబ్‎డెస్క్: ఏపీలో నేటీ నుంచి స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం కానున్నాయి. కరోనా వ్యాప్తి దృష్ట్యా మూతపడిన స్కూళ్లు, కాలేజీలు తెరుచుకుంటున్నాయి. ఈ నెల 2వ తేదీ నుంచి ఏపీలో స్కూళ్లను రీ-ఓపెన్ అయ్యాయి. ముందుగా 9, 10 తరగతులు ప్రారంభించి.. దశల వారీగా క్లాసులను రీ-ఓపెన్ చేయాలని షెడ్యూల్ ఖరారు చేసింది. దీంతో నేటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు తరగతులు నిర్వహించనుంది.

8, 9 తరగతుల విద్యార్థులు రోజు విడిచి రోజు పాఠశాలకు హాజరు కావాల్సి ఉంది. కాగా, 10వ తరగతి విద్యార్థులు ప్రతిరోజూ పాఠశాలలకు హాజరయ్యేలా షెడ్యూల్ మారింది. ఇక డిసెంబర్ 14 నుంచి 6, 7 తరగతి విద్యార్థులకు కూడా తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం.

Tags:    

Similar News