సోమవారం మోగనున్న బడిగంట

దిశ ప్రతినిధి, హైద‌రాబాద్: పాఠశాలల్లో బడిగంట మోగనుంది. సోమవారం నుంచి పాఠశాలలు ప్రారంభంకానున్నాయి. కొవిడ్ ​నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ 9,10 తరగతులు, ఆపై తరగతుల విద్యార్థులకు క్లాస్ లు నిర్వహించున్నారు. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తరగతి గదులను శానిటైజేషన్​ చేశారు. సుదీర్ఘ విరామం తర్వాత పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాంగా హైద‌రాబాద్ జిల్లా క‌లెక్టర్ శ్వేతా మ‌హంతి జిల్లాలోని అన్ని పాఠ‌శాల‌ల […]

Update: 2021-01-30 13:30 GMT

దిశ ప్రతినిధి, హైద‌రాబాద్: పాఠశాలల్లో బడిగంట మోగనుంది. సోమవారం నుంచి పాఠశాలలు ప్రారంభంకానున్నాయి. కొవిడ్ ​నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ 9,10 తరగతులు, ఆపై తరగతుల విద్యార్థులకు క్లాస్ లు నిర్వహించున్నారు. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తరగతి గదులను శానిటైజేషన్​ చేశారు. సుదీర్ఘ విరామం తర్వాత పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాంగా హైద‌రాబాద్ జిల్లా క‌లెక్టర్ శ్వేతా మ‌హంతి జిల్లాలోని అన్ని పాఠ‌శాల‌ల విద్యార్థుల కోసం హెచ్​ఎంలకు శానిటైజ‌ర్లు , మాస్కులు అంద‌జేశారు.

పాఠశాలలు తిరిగి ప్రారంభం కానుండ‌డంతో హైద‌రాబాద్ జిల్లాలో హడావుడి మొదలైంది. స్కూళ్ల మూసివేతతో వాటి ఆవరణలో పేరుకుపోయిన చెత్త, తుప్పలను తొలగించడం, తరగతి గదులను శానిటైజేషన్ చేయ‌డం పూర్తి చేశారు. స్కూళ్లలో తీసుకుంటున్న జాగ్రత్త చర్యల ను విద్యాశాఖ వాట్సాప్‌ గ్రూపుల్లో ఫొటోలతో అప్‌డేట్‌ చేయాలని డీఈఓ ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్‌ ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు డీఈఓ రోహిణి పేర్కొన్నారు. 9, 10 తరగతుల విద్యార్థులు పాఠాలు వినేందుకు త‌ల్లిదండ్రుల నుంచి నో ఆబ్జక్షన్ స‌ర్టిఫికెట్ కూడా తీసుకున్నారు. బెంచికీ ఒకరు, త‌ర‌గ‌తి గదిలో 20మంది విద్యార్థులు కూర్చునేలా ఏర్పాటు చేస్తున్నారు త‌ర‌గ‌తుల‌కు హాజ‌రు కావ‌డం ఇష్టం లేని విద్యార్థులు ఆన్ లైన్ క్లాసెస్ కూడా వినే అవ‌కావం క‌ల్పించారు .

1,307 పాఠ‌శాల‌ల్లో..

హైద‌రాబాద్ జిల్లాలో మొత్తం 1,307 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠ‌శాల‌లు ఉన్నాయి. వీటిలో 182 ప్రభుత్వ పాఠ‌శాలలు, 1,125 ప్రైవేట్ పాఠ‌శాల‌లు ఉన్నాయి. అన్ని పాఠ‌శాల‌ల్లో క‌లిపి 9, 10 త‌ర‌గ‌తుల్లో 1.38 ల‌క్షల మం ది విద్యార్థులు ఉన్నారు. వీరిలో 18 వేల మంది ప్రభుత్వ, 9 వేల మంది ఎయిడెడ్ పాఠ‌శాల‌కు చెందిన విద్యార్థులు, కాగా మిగిలిన వారు ప్రైవేట్ పాఠ‌శాల‌ల వి ద్యార్థులు. ప్రభుత్వ పాఠ‌శాల‌ల్లో చ‌దివే విద్యార్థుల త‌ల్లిదండ్రులు 42 శాతం త‌మ పిల్లలు త‌ర‌గ‌తుల‌కు హాజ‌ర‌య్యేందుకు లిఖిత పూర్వకంగా అంగీకారం తెలిపారు.

ఏర్పాట్లు పూర్తి చేశాం…

జిల్లాలోని అన్ని పాఠ‌శాల‌ల్లో ఏర్పాట్లు పూర్తి చేశాం. నెల‌లుగా పాఠ‌శాల‌లు మూసి ఉంచ‌డంతో పేరుకుపోయిన చెత్తను తొల‌గిం చాం. బెంచీకి ఒకరు చొప్పున 20 మంది విద్యా ర్థుల‌ను మాత్రమే త‌ర‌గ‌తి గ‌తిలో కూర్చునేలా ఏర్పాట్లు చేశాం. విద్యార్థుల‌కు శానిటైజ‌ర్లు, మాస్కులు అందిస్తాం. పాఠ‌శాల‌ల‌కు రాని విద్యార్థుల కోసం ఆన్ లైన్ లో త‌ర‌గ‌తులు కూడా కొన‌సాగ‌ను న్నాయి. –రోహిణి, హైద‌రాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి

Tags:    

Similar News