ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. స్కూల్స్ ప్రారంభం ఇప్పుడే కాదు

దిశ, వెబ్‌డెస్క్: విద్యా సంస్థల పున: ప్రారంభం నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌ను మంగళవారం విచారించిన హైకోర్టు రేపటి నుంచే ప్రత్యక్ష తరగతులకు అనుమతి ఇచ్చింది. కానీ, గురుకులాలు, హాస్టళ్లలో ప్రత్యక్ష బోధనపై స్టే విధిస్తూ.. వసతులపై స్పష్టమైన నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రత్యక్ష తరగతులు నిర్వహించని ప్రైవేట్ స్కూల్స్‌పై చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వానికి సూచించింది. ప్రత్యేక్ష బోధనకు విద్యార్థులను బలవతం చేయకూడదని, తరగతులకు హాజరుకాని విద్యార్థులపై చర్యలు తీసుకోకూడదని […]

Update: 2021-08-31 00:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: విద్యా సంస్థల పున: ప్రారంభం నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌ను మంగళవారం విచారించిన హైకోర్టు రేపటి నుంచే ప్రత్యక్ష తరగతులకు అనుమతి ఇచ్చింది. కానీ, గురుకులాలు, హాస్టళ్లలో ప్రత్యక్ష బోధనపై స్టే విధిస్తూ.. వసతులపై స్పష్టమైన నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రత్యక్ష తరగతులు నిర్వహించని ప్రైవేట్ స్కూల్స్‌పై చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వానికి సూచించింది. ప్రత్యేక్ష బోధనకు విద్యార్థులను బలవతం చేయకూడదని, తరగతులకు హాజరుకాని విద్యార్థులపై చర్యలు తీసుకోకూడదని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అలాగే విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఎలాంటి రాతపూర్వక హామీ తీసుకోకూడదని తెలిపింది. వారం రోజుల్లోగా సరైన గైడ్‌లైన్స్‌ను జారీ చేయాలని విద్యా శాఖకు ఆదేశాలు జారీ చేస్తూ.. తదుపరి విచారణను అక్టోబర్‌ 4వ తేదీకి వాయిదా వేసింది.

Tags:    

Similar News