డెబిట్ కార్డు మరిచిపోయారా..? ATMలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి విత్‌డ్రా చేయండిలా!

దిశ, డైనమిక్ బ్యూరో : ప్రస్తుతం చాలా చోట్ల నగదు రహిత లావాదేవీలు జరగుతున్నప్పటికీ కొన్ని చోట్ల ఇంకా నగదు మాత్రమే తీసుకుంటున్నారు. ఈక్రమంలో అప్పుడప్పుడు ఏటీఎంకి వెళ్లాల్సి వస్తోంది. అయితే, ఏటీఎం వినియోగం తగ్గే సరికి కార్డు లేకుండా ఏటీఎం నుంచి డబ్బు విత్ డ్రా చేసే అవకాశం ఉంటే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు. అయితే, ఇప్పటి వరకు నగదు డిపాజిట్ చేసేందుకు కార్డు లేకున్నా మొబైల్ నెంబర్ లేదా అకౌంట్ నెంబర్‌తో ట్రాన్సాక్షన్ చేయొచ్చు. […]

Update: 2021-12-02 08:33 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ప్రస్తుతం చాలా చోట్ల నగదు రహిత లావాదేవీలు జరగుతున్నప్పటికీ కొన్ని చోట్ల ఇంకా నగదు మాత్రమే తీసుకుంటున్నారు. ఈక్రమంలో అప్పుడప్పుడు ఏటీఎంకి వెళ్లాల్సి వస్తోంది. అయితే, ఏటీఎం వినియోగం తగ్గే సరికి కార్డు లేకుండా ఏటీఎం నుంచి డబ్బు విత్ డ్రా చేసే అవకాశం ఉంటే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు. అయితే, ఇప్పటి వరకు నగదు డిపాజిట్ చేసేందుకు కార్డు లేకున్నా మొబైల్ నెంబర్ లేదా అకౌంట్ నెంబర్‌తో ట్రాన్సాక్షన్ చేయొచ్చు. కానీ, యూపీఐ మాదిరిగానే క్యూ ఆర్ కోడ్ ద్వారా నగదు విత్ డ్రా చేసే సదుపాయం కోసం ఎదురుచూస్తున్న వారికి ఎన్‌సీఆర్ కార్పొరేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. ఏటీఎంలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి రూ.5000 వరకు విత్ డ్రా చేసే సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఈ టెక్నాలజీని వినియోగించి ఏదైనా యూపీఐ యాప్‌తో ఏటీఎమ్ నుంచి విత్‌డ్రా చేసే విధంగా వెసులుబాటు కల్పించింది.

ఖాతాదారులకు మరో షాకిచ్చిన బ్యాంకులు.. ఇక జేబుకు చిల్లులే..!

Tags:    

Similar News