'యోనో'.. లోన్స్ నో నో!
దిశ, వెబ్‌డెస్క్: ఖాతాదారులకు యోనో ద్వారా ఎలాంటి అత్యవసర రుణాలను ఇవ్వట్లేదని ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్‌బీఐ ప్రకటించింది. ప్రభుత్వ బ్యాంకులు 45 నిమిషాల్లో రూ. 5 లక్షల వరకూ అత్యవసర రుణాలను మంజూరు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ రుణాలకు 10.5 శాతం మాత్రమే వడ్డీ అని, ఆరు నెలల అనంతరం ఈఎమ్ఐలు మొదలవుతాయని ఇటీవల వచ్చిన వార్తలు వదంతులు మాత్రమేనని ఎస్‌బీఐ వివరణ ఇచ్చింది. ఎస్‌బీఐ బ్యాంక్ అకౌంట్ నుంచి జీతాలను పొందేవారికి, ముందుగా […]
దిశ, వెబ్‌డెస్క్: ఖాతాదారులకు యోనో ద్వారా ఎలాంటి అత్యవసర రుణాలను ఇవ్వట్లేదని ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్‌బీఐ ప్రకటించింది. ప్రభుత్వ బ్యాంకులు 45 నిమిషాల్లో రూ. 5 లక్షల వరకూ అత్యవసర రుణాలను మంజూరు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ రుణాలకు 10.5 శాతం మాత్రమే వడ్డీ అని, ఆరు నెలల అనంతరం ఈఎమ్ఐలు మొదలవుతాయని ఇటీవల వచ్చిన వార్తలు వదంతులు మాత్రమేనని ఎస్‌బీఐ వివరణ ఇచ్చింది. ఎస్‌బీఐ బ్యాంక్ అకౌంట్ నుంచి జీతాలను పొందేవారికి, ముందుగా ఆమోదించిన వ్యక్తిగత రుణాలను యోనో ప్లాట్‌ఫామ్ ద్వారా ఇచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయని స్పష్టం చేసింది.