జీడీపీ వృద్ధిరేటును సవరించిన ఎస్‌బీఐ నివేదిక

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత జీడీపీని ఇదివరకు అంచనా వేసిన 7.4 శాతం నుంచి 7 శాతానికి సవరిస్తున్నట్టు వెల్లడించింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి 0.3 శాతం పెరుగుతుందని ఎస్‌బీఐ అంచనా వేసింది. ఇక, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి చివరి త్రైమాసికంలో దేశ జీడీపీ 2.5 శాతం వృద్ధిని సాధిస్తుందని పేర్కొంది. ‘ఎస్‌బీఐ నౌకాస్టింగ్ మోడల్’ ఆధారంగా అంచనా వేసిన […]

Update: 2021-02-10 09:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత జీడీపీని ఇదివరకు అంచనా వేసిన 7.4 శాతం నుంచి 7 శాతానికి సవరిస్తున్నట్టు వెల్లడించింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి 0.3 శాతం పెరుగుతుందని ఎస్‌బీఐ అంచనా వేసింది. ఇక, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి చివరి త్రైమాసికంలో దేశ జీడీపీ 2.5 శాతం వృద్ధిని సాధిస్తుందని పేర్కొంది. ‘ఎస్‌బీఐ నౌకాస్టింగ్ మోడల్’ ఆధారంగా అంచనా వేసిన జీడీపీ వృద్ధి మొత్తం ఆర్థిక సమవత్సరానికి 7 శాతం ఉంటుంది. అలాగే మూడో త్రైమాసికానికి 0.3 శాతంతో సానుకూలానికి మారుతుందని’ ఎస్‌బీఐ తన ఎకోరాప్ నివేదికలో పేర్కొంది. ఇక, వచ్చే ఆర్థిక సంవత్సరానికి గానూ భారత జీడీపీ 11 శాతం వృద్ధిని ఎస్‌బీఐ అంచనా వేసింది. ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రతిపాదించిన బ్యాడ్ బ్యాంక్ కోసం ఆస్తి నిర్వహణ సంస్థ(ఏఎంసీ), ఆసిత్ పునర్నిర్మాణ సంస్థ(ఏఆర్‌సీ) ఏర్పాటును ఎస్‌బీఐ నివేదిక స్వాగతించింది.

ఇది ఒత్తిడితో ఉన్న ఆస్తుల పునరుద్ధరణ, పరిష్కారానికి సహాయపడుతుందని నివేదిక అభిప్రాయపడింది. అదేవిధంగా సవరించిన బడ్జెట్ అంచనాలో 2020-21కి రూ. 19 లక్షల కోట్ల స్థూల పన్ను ఆదాయం తక్కువని, వాస్తవ వసూళ్లు సుమారు రూ. 2.8 లక్షల కోట్లు పెరిగే అవకాశం ఉందని నివేదిక భావిస్తోంది. దీనివల్ల భారత ద్రవ్యలోటు జీడీపీలో 0.6 శాతం తగ్గిస్తుంది. అంతేకాకుండా 2021-22లో ప్రభుత్వ స్థూల పన్ను వసూళ్లు రూ. 22.17 లక్షల కోట్ల కంటే ఎక్కువ ఉంటుందని ఎస్‌బీఐ నివేదిక వెల్లడించింది.

Tags:    

Similar News