పెన్షనర్లకు ఎస్‌బీఐ శుభవార్త!

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) పెన్షనర్లకు ఊరట కల్పించింది. పింఛనుదారులు ఇకమీదట లైఫ్ సర్టిఫికేట్లను ఏ ఎస్‌బీఐ బ్రాంచ్‌లోనైనా సమర్పించేందుకు అవకాశం ఇస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. పింఛనుదారుల కోసమే ఉద్దేశించిన పెన్షన్ సేవా పోర్టల్ పునరుద్ధరణలో భాగంగా ఈ సదుపాయాన్ని ఇస్తున్నామని, పెన్షన్ వివరాలను సులభంగా పొందడానికి వెసులుబాటు ఇస్తున్నట్టు ఎస్‌బీఐ తెలిపింది. అంతేకాకుండా, ఎస్‌బీఐ సేవా పోర్టల్ ద్వారా పెన్షనర్లు వారికి సంబంధించిన పెన్షన్ స్లిప్ […]

Update: 2021-09-22 07:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) పెన్షనర్లకు ఊరట కల్పించింది. పింఛనుదారులు ఇకమీదట లైఫ్ సర్టిఫికేట్లను ఏ ఎస్‌బీఐ బ్రాంచ్‌లోనైనా సమర్పించేందుకు అవకాశం ఇస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. పింఛనుదారుల కోసమే ఉద్దేశించిన పెన్షన్ సేవా పోర్టల్ పునరుద్ధరణలో భాగంగా ఈ సదుపాయాన్ని ఇస్తున్నామని, పెన్షన్ వివరాలను సులభంగా పొందడానికి వెసులుబాటు ఇస్తున్నట్టు ఎస్‌బీఐ తెలిపింది. అంతేకాకుండా, ఎస్‌బీఐ సేవా పోర్టల్ ద్వారా పెన్షనర్లు వారికి సంబంధించిన పెన్షన్ స్లిప్ లేదా ఫారమ్-16ని పొందవచ్చు. పెన్షన్ లావాదేవీల వివరాలను తెలుసుకోవచ్చు.

అలాగే, అరియర్ బ్యాలెన్స్ వివరాలను, వినియోగదారులు తమ లైఫ్ సర్టిఫికేట్ స్టేటస్ తీసుకోవచ్చని, పెన్షన్ ప్రొఫైల్ వివరాలను తెలుసుకునే వీలుంటుందని ఎస్‌బీఐ వివరించింది. వీటితో పాటు కొత్తగా పెన్షన్ చెల్లింపుల వివరాలతో పాటు పెన్షనర్ల మొబైల్‌కు మేసేజ్‌లను అందించనుంది. వినియోగదారులు పెన్షన్ స్లిప్‌ను ఈ-మెయిల్ లేదా పెన్షన్ చెల్లింపుల శాఖ ద్వారా పొందడానికి వీలు కల్పించింది. లైఫ్ సర్టిఫికెట్లను ఎస్‌బీఐకి చెందిన ఏ బ్రాంచ్‌లోనైనా ఇవ్వొచ్చు. బ్యాంక్ బ్రాంచుల్లో జీవన్ ప్రమాణ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుందని ఎస్‌బీఐ వెల్లడించింది.

Tags:    

Similar News