రైతులకు రుణాలందించేందుకు అదానీ కేపిటల్‌తో ఎస్‌బీఐ భాగస్వామ్యం!

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) రైతులకు రుణాలు అందించేందుకు అదానీ కేపిటల్‌తో కో-లెండర్‌గా భాగస్వామ్యం చేసుకుంది. అదానీ గ్రూపునకు చెందిన ఎన్‌బీఎఫ్‌సీ విభాగం అదానీ కేపిటల్‌తో వ్యవసాయ కార్యకలాపాల సామర్థ్యాన్ని పెంచేందుకు, ట్రాక్టర్, వ్యవసాయ పనిముట్లు కొనుగోళ్ల కోసం రైతులకు రుణాలందించేందుకు ఒప్పందంపై సంతకం చేసినట్టు ఎస్‌బీఐ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. పంట ఉత్పాదకతను పెంపొందించేందుకు వ్యవసాయ యంత్రాలను అనుసరించాలనుకునే రైతుల కోసం ఈ భాగస్వామ్యం ఎంతో తోడ్పడుతుందని […]

Update: 2021-12-02 04:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) రైతులకు రుణాలు అందించేందుకు అదానీ కేపిటల్‌తో కో-లెండర్‌గా భాగస్వామ్యం చేసుకుంది. అదానీ గ్రూపునకు చెందిన ఎన్‌బీఎఫ్‌సీ విభాగం అదానీ కేపిటల్‌తో వ్యవసాయ కార్యకలాపాల సామర్థ్యాన్ని పెంచేందుకు, ట్రాక్టర్, వ్యవసాయ పనిముట్లు కొనుగోళ్ల కోసం రైతులకు రుణాలందించేందుకు ఒప్పందంపై సంతకం చేసినట్టు ఎస్‌బీఐ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.

పంట ఉత్పాదకతను పెంపొందించేందుకు వ్యవసాయ యంత్రాలను అనుసరించాలనుకునే రైతుల కోసం ఈ భాగస్వామ్యం ఎంతో తోడ్పడుతుందని ఎస్‌బీఐ వివరించింది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు పలు ఎన్‌బీఎఫ్‌సీలతో కలిసి కో-లెండింగ్ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు ఎస్‌బీఐ పేర్కొంది. దేశంలోని వ్యవసాయ విభాగం తో కొనసాగేందుకు, దేశీయ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ వృద్ధి తో పాటు బ్యాంకు వినియోగదారుల సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ భాగస్వామ్యం దోహదం చేస్తుందని ఎస్‌బీఐ ఛైర్మన్ దినేష్ ఖారా అన్నారు. బ్యాంకింగ్ సేవలను అందరికీ చేరువచేసేందుకు మరిన్ని ఎన్‌బీఎఫ్‌సీలతో కలిసి పనిచేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు.

Tags:    

Similar News