అలర్ట్.. SBI ఖాతాదారులకు ముఖ్య గమనిక..!

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ఖాతాదారులకు ఖాతాదారులకు కీలక సమాచారం చేరవేసింది. జులై 4వ తేదీన(ఆదివారం) నిర్వాహణ కార్యకలాపాల కారణంగా ఎస్‌బీఐలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండబోవని ప్రకటించింది. ఈ సమయంలో ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, UPI సేవలు నిలిపివేయబడనున్నాయి. ఈ విషయాన్ని ఎస్‌బీఐ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసింది. ఈ కాలంలో ఇంటర్నెట్ బ్యాంకింగ్/యోనో/యోనో లైట్/UPI అందుబాటులో ఉండదు. ఈ […]

Update: 2021-07-03 01:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ఖాతాదారులకు ఖాతాదారులకు కీలక సమాచారం చేరవేసింది. జులై 4వ తేదీన(ఆదివారం) నిర్వాహణ కార్యకలాపాల కారణంగా ఎస్‌బీఐలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండబోవని ప్రకటించింది. ఈ సమయంలో ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, UPI సేవలు నిలిపివేయబడనున్నాయి. ఈ విషయాన్ని ఎస్‌బీఐ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసింది. ఈ కాలంలో ఇంటర్నెట్ బ్యాంకింగ్/యోనో/యోనో లైట్/UPI అందుబాటులో ఉండదు. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని.. దయచేసి క్షమించాలని ఎస్‌బీఐ సంస్థ కోరింది. అంతేగాకుండా… జూలై 1 నుండి ఎస్‌బీఐ ఏటీఎంలు మరియు శాఖల నుంచి నాలుగు సార్లు ఉచితంగా నగదు ఉపసంహరణకు అర్హత ఉంటుందని తెలిపింది. అంతకంటే ఎక్కువ సార్లు వినియోగదారులు ప్రతి లావాదేవీకి రూ .15తో పాటు జీఎస్టీ ఛార్జీని ఎదుర్కొంటారని ఎస్‌బీఐ ఇటీవల ప్రకటించింది.

Tags:    

Similar News