హోం లోన్: షాకిచ్చిన SBI
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) గృహ రుణాలపై వడ్డీ రేట్లను సవరించింది. గృహ రుణాలపై 0.25 శాతం పెంచడంతో గృహ రుణాల వడ్డీ రేట్లు 6.95 శాతానికి చేరింది. ఈ మార్పు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్టు ఎస్‌బీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. గత నెల ఎస్‌బీఐ ప్రత్యేక ఆఫర్ కింద కనీస వడ్డీ రేట్లను 6.70 శాతానికి తగ్గించడంతో పాటు ప్రాసెసింగ్ ఫీజుపై 100 శాతం […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) గృహ రుణాలపై వడ్డీ రేట్లను సవరించింది. గృహ రుణాలపై 0.25 శాతం పెంచడంతో గృహ రుణాల వడ్డీ రేట్లు 6.95 శాతానికి చేరింది. ఈ మార్పు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్టు ఎస్‌బీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. గత నెల ఎస్‌బీఐ ప్రత్యేక ఆఫర్ కింద కనీస వడ్డీ రేట్లను 6.70 శాతానికి తగ్గించడంతో పాటు ప్రాసెసింగ్ ఫీజుపై 100 శాతం రాయితీని అందించింది.
అయితే, ఇది తాత్కాలిక ఆఫర్‌గా మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్నట్టు స్పష్టం చేసింది. దీంతో ఏప్రిల్ 1 తర్వాత కొత్త వడ్డీ రేట్లను అమల్లోకి తెచ్చినట్టు తెలిపింది. అలాగే, గృహ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును 0.40 శాతం విధించనుంది. దీంతో పాటు జీఎస్టీ ఛార్జీలు అదనం. రుణాలను బట్టి ప్రాసెసింగ్ ఫీజు రూ. 10,000-రూ. 30,000 మధ్య ఉండనున్నట్టు బ్యాంకు వివరించింది. ఎస్‌బీఐ ప్రకటనతో మిగిలిన బ్యాంకులు సైతం ఇదే తరహా నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉన్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి.