ఐదేళ్లలో ఎస్‌బీఐ జీరో బ్యాలెన్స్ అకౌంట్ల నుంచి రూ. 300 కోట్ల వసూళ్లు

దిశ, వెబ్‌డెస్క్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) సహా పలు బ్యాంకులు జీరో బ్యాలెన్స్ అకౌంట్ లేదా బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్‌స్(బీఎస్‌బీడీఏ) ఉన్న పేదలకు అందించే అకౌంట్ల నుంచి అధిక మొత్తంలో సేవల ఛార్జీలను వసూలు చేసినట్టు ఐఐటీ-బొంబాయి అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా జీరో బ్యాలెన్స్ అకౌంట్లను అధికంగా కలిగిన ఎస్‌బీఐ నెలలో నాలుగు సార్ల కంటే ఎక్కువ జరిగే ప్రతి డెబిట్ లావాదేవీకి రూ. 17.70 వసూలు చేసినట్టు అధ్యయనం తెలిపింది. ఇలాంటి […]

Update: 2021-04-11 09:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) సహా పలు బ్యాంకులు జీరో బ్యాలెన్స్ అకౌంట్ లేదా బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్‌స్(బీఎస్‌బీడీఏ) ఉన్న పేదలకు అందించే అకౌంట్ల నుంచి అధిక మొత్తంలో సేవల ఛార్జీలను వసూలు చేసినట్టు ఐఐటీ-బొంబాయి అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా జీరో బ్యాలెన్స్ అకౌంట్లను అధికంగా కలిగిన ఎస్‌బీఐ నెలలో నాలుగు సార్ల కంటే ఎక్కువ జరిగే ప్రతి డెబిట్ లావాదేవీకి రూ. 17.70 వసూలు చేసినట్టు అధ్యయనం తెలిపింది.

ఇలాంటి సేవల ఛార్జీల విధించడం ద్వారా 2015-20 మధ్య కాలంలో ఎస్‌బీఐ దాదాపు 12 కోట్ల జీరో బ్యాలెన్స్ అకౌంట్ల నుంచి రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసినట్టు తెలుస్తోంది. 3.9 కోట్ల జీరో బ్యాలెన్స్ అకౌంట్లను కలిగిన దేశీయ రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ పబ్జాబ్ నేషనల్ బ్యాంక్ సమీక్షించిన కాలంలో రూ. 9.9 కోట్ల సేవల ఛార్జీలను వసూలు చేసింది. ఎస్‌బీఐ 2018-19లో మాత్రమే రూ. 72 కోట్లను వసూలు చ్యగా, 2019-20లో రూ. 158 కోట్లను వసూలు చేసిందని ఐఐటీ బొంబాయి ప్రొఫెసర్ ఆశిష్ దాస్ చెప్పారు. 2013 ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం.. జీరో బ్యాలెన్స్ అకౌంట్ల నుంచి నెలలో నాలుగుసార్ల కంటే ఎక్కువ జరిగే డెబిట్ లావాదేవీలకు సేవల ఛార్జీలను వసూలు చేస్తున్నారు.

Tags:    

Similar News