రూ. 2,000 కోట్ల నిధుల సేకరించనున్న ఎస్‌బీఐ కార్డ్స్!
దిశ, వెబ్‌డెస్క్: ఒకటి లేదా అంతకంటే ఎక్కువ దశల్లో డెట్ సెక్యూరిటీల జారీ ద్వారా రూ. 2000 కోట్లను సేకరించాలని భావిస్తున్నట్టు ఎస్‌బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీస్ లిమిటెడ్(ఎస్‌బీఐ కార్డ్స్) సోమవారం తెలిపింది. కన్వర్టబుల్ కాని డిబెంచర్‌ల జారీ ద్వారా నిధుల సేకరణ ఆమోదానికి సంస్థ డైరెక్టర్ల సమావేశం రాబోయే శుక్రవారం(మార్చి 12న) జరగాల్సి ఉంది. ఈ సమావేశం అనంతరం నిధుల సేకరణ ప్రక్రియను ఒకటి లేదా ఎక్కువ దశల్లో సేకరించనున్నారు. కాగా, తాజా ప్రకటన […]
దిశ, వెబ్‌డెస్క్: ఒకటి లేదా అంతకంటే ఎక్కువ దశల్లో డెట్ సెక్యూరిటీల జారీ ద్వారా రూ. 2000 కోట్లను సేకరించాలని భావిస్తున్నట్టు ఎస్‌బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీస్ లిమిటెడ్(ఎస్‌బీఐ కార్డ్స్) సోమవారం తెలిపింది. కన్వర్టబుల్ కాని డిబెంచర్‌ల జారీ ద్వారా నిధుల సేకరణ ఆమోదానికి సంస్థ డైరెక్టర్ల సమావేశం రాబోయే శుక్రవారం(మార్చి 12న) జరగాల్సి ఉంది. ఈ సమావేశం అనంతరం నిధుల సేకరణ ప్రక్రియను ఒకటి లేదా ఎక్కువ దశల్లో సేకరించనున్నారు. కాగా, తాజా ప్రకటన నేపథ్యంలో సోమవారం ఎస్‌బీఐ కార్డ్స్ షేర్ ధర స్వల్పంగా 0.93 శాతం పెరిగి రూ. 1,068.15 వద్ద ట్రేడయింది.