ఎస్‌బీఐ కొత్త మేనేజింగ్ డైరెక్టర్ల నియామకం
దిశ, వెబ్‌డెస్క్: రాబోయే మూడేళ్ల పాటు దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) కొత్త మేనేజింగ్ డైరెక్టర్లుగా స్వామినాథన్ జానకి రామన్, అశ్విని కుమార్ తివారీలను ప్రభుత్వం నియమించింది. వీరిద్దరిని మేనేజింగ్ డైరెక్టర్లుగా నియమించాలన్న ఆర్థిక సేవల విభాగం ప్రతిపాదనలను కేబినెట్ నియామక కమిటీ బుధవారం ఆమోదం తెలిపింది. గతేడాది అక్టోబర్‌లో ఎస్‌బీఐ ఎండీ ఖాళీలకు బ్యాంకుల బోర్డు బ్యూరో (బీబీబీ) స్వామినాథన్ జానకిరామన్, అశ్విని కుమార్ తివారీ పేర్లను సిఫారసు […]
దిశ, వెబ్‌డెస్క్: రాబోయే మూడేళ్ల పాటు దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) కొత్త మేనేజింగ్ డైరెక్టర్లుగా స్వామినాథన్ జానకి రామన్, అశ్విని కుమార్ తివారీలను ప్రభుత్వం నియమించింది. వీరిద్దరిని మేనేజింగ్ డైరెక్టర్లుగా నియమించాలన్న ఆర్థిక సేవల విభాగం ప్రతిపాదనలను కేబినెట్ నియామక కమిటీ బుధవారం ఆమోదం తెలిపింది. గతేడాది అక్టోబర్‌లో ఎస్‌బీఐ ఎండీ ఖాళీలకు బ్యాంకుల బోర్డు బ్యూరో (బీబీబీ) స్వామినాథన్ జానకిరామన్, అశ్విని కుమార్ తివారీ పేర్లను సిఫారసు చేసింది. వీరిద్దరూ ప్రస్తుతం ఎస్‌బీఐతో కలిసి పనిచేస్తున్నారు. జానకిరామన్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్(ఫైనాన్స్)గా పనిచేస్తుండగా, తివారీ బ్యాంకు అనుబంధ సంస్థ అయిన ఎస్‌బీఐ కార్డ్ ఎండీ, సీఈఓగా పనిచేస్తున్నారు.