రుణాలపై భారీ ఆఫర్లు ప్రకటించిన ఎస్ బీఐ..
దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాది పండుగ సీజన్ కోసం ఇప్పటికే బ్యాంకులు, ఇతర సంస్థలు వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటించాయి. ఇప్పటికే గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించిన దేశీయ ప్రభుత్వ రంగ దిగ్గజ ఎస్‌బీఐ తాజాగా పండుగ సీజన్ కోసం వినియోగదారులకు గృహ రుణాలతో పాటు వాహన రుణం, బంగారు రుణం, వ్యక్తిగత రుణాలపై కూడా పలు ప్రయోజనాలను ఇస్తున్నట్టు వెల్లడించింది. ఇందులో భాగంగా కార్ల రుణాలపై రూ. లక్షకు రూ. 1,539, బంగారు […]
దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాది పండుగ సీజన్ కోసం ఇప్పటికే బ్యాంకులు, ఇతర సంస్థలు వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటించాయి. ఇప్పటికే గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించిన దేశీయ ప్రభుత్వ రంగ దిగ్గజ ఎస్‌బీఐ తాజాగా పండుగ సీజన్ కోసం వినియోగదారులకు గృహ రుణాలతో పాటు వాహన రుణం, బంగారు రుణం, వ్యక్తిగత రుణాలపై కూడా పలు ప్రయోజనాలను ఇస్తున్నట్టు వెల్లడించింది. ఇందులో భాగంగా కార్ల రుణాలపై రూ. లక్షకు రూ. 1,539, బంగారు రుణాలపై 7.5 శాతం వడ్డీతో పాటు వ్యక్తిగత రుణాలపై రూ. లక్షకు రూ. 1832 నెలవారీ ఈఎంఐకే అందించనున్నట్టు ఎస్‌బీఐ తెలిపింది.
ఎస్‌బీఐ వినియోగదారులు ఈ ఆఫర్లను పొందేందుకు బ్యాంకు యోనో యాప్ నుంచి రున్ణ దరఖాస్తు చేసుకునే వీలుంటుందని ఓ ప్రకటనలో పేర్కొంది. అంతేకాకుండా పండుగ సీజన్ సందర్భంగా గృహ రుణాలపై మెరుగైన క్రెడిట్ స్కోర్ ఉన్న వినియోగదారులకు రుణ మొత్తంతో సంబంధం లేకుండా 6.70 శాతం వడ్డీకే రుణాన్ని ఇవ్వనున్నట్టు ప్రకటించింది.