బాబుకు పార్టీలు హ్యాండ్.. పొత్తుకు నై నై
దిశ, ఏపీ బ్యూరో: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఓ వెలుగు వెలుగొందారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. తొమ్మిదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ చంద్రబాబు హవా ఎక్కడా తగ్గలేదు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబుకు కాలం కలిసిరావడం లేదు. కాలం కలిసి రాకపోతే ఎంతటి వారికైనా ఉపద్రవం తప్పదు అన్నట్లుగా రెండేళ్లుగా అదృష్టం సహకరించడం లేదు. పార్టీలో సీనియర్ నేతలు కొందరు గుడ్‌బై చెప్తుంటే మరికొందరు సైలెంట్‌గా ఉండిపోతున్నారు. ఇంకొందరైతే అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయారు. […]
దిశ, ఏపీ బ్యూరో: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఓ వెలుగు వెలుగొందారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. తొమ్మిదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ చంద్రబాబు హవా ఎక్కడా తగ్గలేదు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబుకు కాలం కలిసిరావడం లేదు. కాలం కలిసి రాకపోతే ఎంతటి వారికైనా ఉపద్రవం తప్పదు అన్నట్లుగా రెండేళ్లుగా అదృష్టం సహకరించడం లేదు. పార్టీలో సీనియర్ నేతలు కొందరు గుడ్‌బై చెప్తుంటే మరికొందరు సైలెంట్‌గా ఉండిపోతున్నారు. ఇంకొందరైతే అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు వేసిన ఏ పాచిక పారడం లేదు. రాష్ట్రంలో వైసీపీని దీటుగా ఎదుర్కోవాలంటే అది ఒక్క టీడీపీతో సాధ్యం కాదని చంద్రబాబు భావిస్తున్నారు. వైసీపీపై పోరాటం చేయాలంటే అందుకు బీజేపీ, జనసేన, వామపక్ష పార్టీలు సహకరించాలని కోరుతున్నారు. అయితే ఆ పార్టీలు మాత్రం చంద్రబాబుతో చేతులు కలిపేందుకు ససేమిరా అంటున్నాయి.
ముఖ్యంగా బీజేపీ అయితే పొత్తు అనేది కల అని చెప్తోంది. మరోవైపు జనసేన పార్టీ సైతం పొత్తు అంటేనే నై అంటోంది. ఇక వామపక్ష పార్టీలలో సీపీఎం ఏదో అంటీముట్టనట్లుగా ఉంది. ఇకపోతే మున్సిపల్ ఎన్నికల వరకు టీడీపీ సై అంటే సైసై అనే సీపీఐ పార్టీ సైతం రాంరాం అంటోంది. ఇటీవలే టీడీపీ మహానాడులో బీజేపీకి అంశాల వారీగా మద్దతు ఇస్తామని చంద్రబాబు ప్రకటించడంతో సీపీఐ దూరంగా ఉంటుంది. ఇదిలా ఉంటే టీడీపీలో క్రమశిక్షణ సైతం లోపించిందని తెలుస్తోంది. నేతలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని చంద్రబాబు దృష్టికి వచ్చింది. అటు పార్టీలు హ్యాండిస్తుండటం.. సొంత పార్టీలో గందరగోళంతో చంద్రబాబు ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. మెుత్తానికి చంద్రబాబు ఏకాకిగా మిగిలిపోయారని ఏపీ పొలిటికల్ సర్కిల్‌లో చర్చ జరుగుతుంది.