మమత ప్రమాణ స్వీకారోత్సవంలో సౌరవ్ గంగూలీ

దిశ, స్పోర్ట్స్ : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ అత్యధిక స్థానాలు గెలుచుకోవడంతో.. ఆమె ఎమ్మెల్యేగా ఓడిపోయినా రాజ్యంగంలోని వెసులు బాటును బట్టి సీఎంగా ప్రమాణం చేశారు. కాగా, కరోనా విస్తృతంగా వ్యాపిస్తున్న ఈ సమయంలో రాజ్‌భవన్‌కు పరిమిత సంఖ్యలో మాత్రమే అతిథులు హజరయ్యారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా మాజీ క్రికెటర్, బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీకి […]

Update: 2021-05-05 10:59 GMT

దిశ, స్పోర్ట్స్ : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ అత్యధిక స్థానాలు గెలుచుకోవడంతో.. ఆమె ఎమ్మెల్యేగా ఓడిపోయినా రాజ్యంగంలోని వెసులు బాటును బట్టి సీఎంగా ప్రమాణం చేశారు. కాగా, కరోనా విస్తృతంగా వ్యాపిస్తున్న ఈ సమయంలో రాజ్‌భవన్‌కు పరిమిత సంఖ్యలో మాత్రమే అతిథులు హజరయ్యారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా మాజీ క్రికెటర్, బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీకి పిలుపు రావడంతో ఆయన వేడుకకు హాజరయ్యారు.

ఈసారి ఎన్నికల్లో టీఎంసీ తరపున పోటీ చేసిన టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీకి మంత్రి పదవి లభించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సారి మంత్రి వర్గంలో యువరక్తాన్ని నింపే ఆలోచనలో ఉన్న మమత.. తివారీకి మంత్రి పదవి కట్టబెడతారని అంటున్నారు. మరోవైపు ఇటీవలే క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన అశోక్ దిండా బీజేపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

 

Tags:    

Similar News