శనివారం పంచాంగం, రాశి ఫలాలు (17-04-2021)
శ్రీ ప్లవ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసం శుక్ల పక్షం తిధి : పంచమి సా 4.31 తదుపరి షష్ఠి వారం : శనివారం (స్థిరవాసరే) నక్షత్రం : మృగశిర రా 10.51 తదుపరి ఆర్ధ్ర యోగం : శోభన సా 4.11 తదుపరి అతిగండ కరణం : బాలువ సా 4.31 తదుపరి కౌలువ తె 5.12 వర్జ్యం : లేదు దుర్ముహూర్తం : ఉ 5.47 – 7.26 అమృతకాలం […]
శ్రీ ప్లవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు
చైత్ర మాసం శుక్ల పక్షం
తిధి : పంచమి సా 4.31
తదుపరి షష్ఠి
వారం : శనివారం (స్థిరవాసరే)
నక్షత్రం : మృగశిర రా 10.51
తదుపరి ఆర్ధ్ర
యోగం : శోభన సా 4.11
తదుపరి అతిగండ
కరణం : బాలువ సా 4.31
తదుపరి కౌలువ తె 5.12
వర్జ్యం : లేదు
దుర్ముహూర్తం : ఉ 5.47 – 7.26
అమృతకాలం : మ 1.13 – 2.58
రాహుకాలం : ఉ 9.00 – 10.30
యమగండం/కేతుకాలం : మ 1.30 – 3.00
సూర్యరాశి : మేషం || చంద్రరాశి : వృషభం
సూర్యోదయం : 5.47 || సూర్యాస్తమయం : 6.11
మేషం : ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వెయ్యడం మంచిది ధన వ్యవహారాలలో ఆలోచనలు కలిసిరావు. ఇంటా బయటా సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చెయ్యవలసి వస్తుంది. వ్యాపారాలలో ఇతరులతో విభేదాలు కలుగుతాయి.
వృషభం : అనుకున్న సమయానికి పనులు పూర్తిచేస్తారు. గృహమున శుభకార్య ప్రస్తావన వస్తుంది. ధన వ్యవహారాలు కలసివస్తాయి. దీర్ఘకాలిక ఋణాలు కొంత వరకు తీరి ఊరట చెందుతారు. నూతన ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తారు.
మిధునం : ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి.వృధా ప్రయాణాలుచేస్తారు. ఇంటా బయటా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మిత్రులతోఅనుకోని కలహాలు కలుగుతాయి. పనులు ముందుకు సాగక చికాకు పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
కర్కాటకం : కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు.పాత మిత్రుల నుండి ఆసక్తికర విషయాలు తెలుసుకుంటారు.వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. భూ క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలలో పురోగతి కలుగుతుంది. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి.
సింహం : ముఖ్యమైన పనులలో సన్నిహితుల సహాయం అందుతుంది. ఆకస్మిక ధనలబ్ది పొందుతారు. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.కుటుంబ సభ్యులతో విందువినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.
కన్య : చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. ఖర్చులు అదుపు చెయ్యడం అవసరం.బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ పనికిరాదు.వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి ఉద్యోగమున వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
తుల : నూతన రుణాలు చెయ్యవలసి వస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ముఖ్యమైన పనులు ముందుకు సాగక నిరాశ కలుగుతుంది. వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు నిలకడ లోపిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ పరుస్తాయి ఉద్యోగస్తులు మాట విషయంలో తొందరపాటు మంచిది కాదు.
వృశ్చికం : చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆర్ధిక పురోగతి సాధిస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగ యత్నాలు విజయవంతమవుతాయి. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలిస్తాయి. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు.
ధనస్సు : నూతన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి సోదరులనుండి శుభవార్తలు అందుతాయి. వాహన అనుకూలత కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి.
మకరం : ఆర్డీజ వ్యవహారాలలో సన్నిహితుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. నూతన వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి వృత్తి, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.
కుంభం : చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. బంధువులతో స్ధిరాస్తి తగాదాలు కలుగుతాయి. కొన్ని వ్యవహారాలలో శిరోభాధలు తప్పవు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.
మీనం : పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మిత్రుల నుంచి వినోదాది కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగుల అంచనాలునిజమౌతాయి. నిరుద్యోగులకుఉద్యోగ యోగమున్నది.