ఎమ్మెల్యే శంకర్ నాయక్‌పై సోషల్ మీడియాలో సెటైర్లు.. ఎందుకో తెలుసా..?
దిశ, మహబూబాబాద్ : గణేష్ నిమజ్జనంలో భాగంగా పంపిణీ చేసే ప్రసాదంలోనూ రాజకీయ లబ్ధిని వెతుక్కున్న ఘనత మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌కే చెల్లిందంటూ జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. టీఆర్‌ఎస్ పార్టీని గుర్తుకు తెచ్చేవిధంగా ప్రసాదం ప్యాకెట్లకు గులాబీ రంగు స్టిక్కర్‌పై ఎమ్మెల్యే, ఆయన సతీమణి ఫొటోలు ఉండటంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం గణేష్ నిమజ్జనోత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే దంపతుల ఫొటో స్టిక్కర్ జతచేసి ప్రసాదం ప్యాకెట్లను మహబూబాబాద్‌లో పంపిణీ చేయడం గమనార్హం. అయితే దేవుడి ప్రసాదమని భక్తితో […]
దిశ, మహబూబాబాద్ : గణేష్ నిమజ్జనంలో భాగంగా పంపిణీ చేసే ప్రసాదంలోనూ రాజకీయ లబ్ధిని వెతుక్కున్న ఘనత మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌కే చెల్లిందంటూ జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. టీఆర్‌ఎస్ పార్టీని గుర్తుకు తెచ్చేవిధంగా ప్రసాదం ప్యాకెట్లకు గులాబీ రంగు స్టిక్కర్‌పై ఎమ్మెల్యే, ఆయన సతీమణి ఫొటోలు ఉండటంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం గణేష్ నిమజ్జనోత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే దంపతుల ఫొటో స్టిక్కర్ జతచేసి ప్రసాదం ప్యాకెట్లను మహబూబాబాద్‌లో పంపిణీ చేయడం గమనార్హం. అయితే దేవుడి ప్రసాదమని భక్తితో కళ్లకు అద్దుకుని తీసుకున్న భక్తులు ఎమ్మెల్యే దంపతుల స్టిక్కర్ చూసి అవాక్కయ్యారు. ‘భక్తిలో కూడా సార్ రాజకీయ లబ్ధి.. తెలివితేటలూ బాగు’ అంటూ నవ్వుకుంటున్నారంట. ప్రసాదం ప్యాకెట్ల ఇష్యూ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు, సామాన్యులు భిన్నభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.