స్పారో.. సారో!

పిచ్చుకపై బ్రహ్మాస్త్రమా.. అని సామెత. బ్రహ్మాస్త్రం సంగతేమోకానీ, పిచ్చుకలు నేడు ఆగం పక్షులయ్యాయి. ఇవి చెట్టుకొకటి, పుట్టకొకటి కాదు కదా.. జీవరాశుల్లో కనీసం నూటికో, కోటికో ఒక్కటి కూడా కనిపించడంలేదు. ఈ రోజు స్పారో డే(ఊరపిచ్చుకల దినోత్సవం). కానీ, వాటి దుస్థితిని చూస్తే ప్రతిరోజూ ‘సారో డే’నే. చిన్నప్పుడు ఊర్లల్లో మనం ఎక్కడ చూసినా ఊరపిచ్చుకలు దర్శనమిచ్చేవి. చెట్టు కొమ్మలపైన, ఇళ్ల చుట్టూ ఎనుగుల మీద, దడి మీద చెంగుచెంగున అటు, ఇటు ఎగురుతూ ఉంటే చూడముచ్చటగా […]

Update: 2020-03-20 02:35 GMT

పిచ్చుకపై బ్రహ్మాస్త్రమా.. అని సామెత. బ్రహ్మాస్త్రం సంగతేమోకానీ, పిచ్చుకలు నేడు ఆగం పక్షులయ్యాయి. ఇవి చెట్టుకొకటి, పుట్టకొకటి కాదు కదా.. జీవరాశుల్లో కనీసం నూటికో, కోటికో ఒక్కటి కూడా కనిపించడంలేదు. ఈ రోజు స్పారో డే(ఊరపిచ్చుకల దినోత్సవం). కానీ, వాటి దుస్థితిని చూస్తే ప్రతిరోజూ ‘సారో డే’నే. చిన్నప్పుడు ఊర్లల్లో మనం ఎక్కడ చూసినా ఊరపిచ్చుకలు దర్శనమిచ్చేవి. చెట్టు కొమ్మలపైన, ఇళ్ల చుట్టూ ఎనుగుల మీద, దడి మీద చెంగుచెంగున అటు, ఇటు ఎగురుతూ ఉంటే చూడముచ్చటగా ఉండేది. కిచ్ కిచ్ మంటూ వాటి లోగొంతుకల నుంచి వచ్చే శబ్దం వీనులవిందుగా ఉండేది. చెట్టు కొమ్మలకు వేళాడుతూ ఉండే గూళ్లు పక్షుల సహజ ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచేవి. ఇప్పుడు పక్షులులేవు, గూళ్లూ లేవు. మచ్చుకైనా కానరావడంలేదు. పిచ్చుకలు సహా చాలా రకాల పక్షిజాతులు క్రమేణా అంతరించిపోతున్నాయి. మనిషి సరికొత్త సాంకేతికతల వైపు పరిగెడుతూ తన చుట్టూ ఉండే జీవవైవిధ్యాన్ని పణంగా పెడుతున్న కారణంగానే పిచ్చుకలు లాంటి చిరుజీవుల చిరాయువు ప్రశ్నార్థకమవుతోందని చెప్పకతప్పదు. బాధాకరం. ఇప్పటికైనా జీవవైవిధ్యాన్ని కాపాడుకుందాం. ప్రకృతికి అదే అందం. మనకదే శ్రీరామరక్ష.
Tags: international sparrow day, sarrow, birds, trees, nests

 

Tags:    

Similar News