నేనే రాజు నేనే మంత్రి అంటున్న సర్పంచ్ భర్త.. ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు
దిశ, వికారాబాద్: వికారాబాద్ జిల్లా, కోట్ పల్లి మండలం, నాగసాన్ పల్లి గ్రామా సర్పంచ్ భర్త తీరు చూస్తుంటే అధికార పార్టీ నాయకులూ అయితే చాలు ఏదైనా చేస్తారా అనే అనుమానం రాకుండా ఉండదు. అతడు ఒక గ్రామ సర్పంచ్ భర్త మాత్రమే, కానీ అతడు చేసిన పని చూస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు. అసలు విషయానికి వస్తే గత 30 ఏళ్ల నుండే నాగసాన్ పల్లి గ్రామం నుండి పక్క గ్రామం అయిన మోత్కుపల్లి గ్రామానికి […]
దిశ, వికారాబాద్: వికారాబాద్ జిల్లా, కోట్ పల్లి మండలం, నాగసాన్ పల్లి గ్రామా సర్పంచ్ భర్త తీరు చూస్తుంటే అధికార పార్టీ నాయకులూ అయితే చాలు ఏదైనా చేస్తారా అనే అనుమానం రాకుండా ఉండదు. అతడు ఒక గ్రామ సర్పంచ్ భర్త మాత్రమే, కానీ అతడు చేసిన పని చూస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు. అసలు విషయానికి వస్తే గత 30 ఏళ్ల నుండే నాగసాన్ పల్లి గ్రామం నుండి పక్క గ్రామం అయిన మోత్కుపల్లి గ్రామానికి ఒక షార్ట్ కట్ రోడ్డు ఉంది. నిజానికి ఆ రోడ్డు గ్రామ నక్షలో కూడా లేదు. అప్పట్లో కేవలం చుట్టూ పక్కల రైతులు తమ పొలాలకు వెళ్ళడానికి అందరి అంగీకారంతో పంటపొలాల మధ్య నుండి బండ్ల బాట మాత్రమే వదిలారు. అంతే పాత రోడ్డు ఉంది కదా నన్ను ఎవరు అడుగుతారులే అనుకున్నాడో లేక గ్రామానికి షార్ట్ కట్ రోడ్డు వేసి మంచి పేరు తెచ్చుకోవాలని అనుకున్నాడో తెలియదు. కాని పట్టా భూములలో ఉన్న పంట పొలాలను నాశనం చేస్తూ ఇష్టా రాజ్యాంగ దాదాపు రోడ్డు వేసి చరిత్ర సృష్టించాడు. దాంతో రోడ్డు వేసే సమయంలో అక్కడ లేని రైతులు ఆలస్యంగా అక్కడికి చేరుకొని లబో దిబో మంటున్నారు.
నిజానికి సర్పంచ్ భర్త పక్కనే ఉన్న ఓ రియల్టర్‌తో చేతులు కలిపి అతడి ల్యాండ్ వ్యాల్యూ పెరగడానికే సర్పంచ్ భర్త దగ్గరుండి ఈ రోడ్డు వేయిస్తున్నాడు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాగసాన్ పల్లి గ్రామస్థులకు మాత్రం ఈ రోడ్డు వేస్తే మన గ్రామానికి బస్సు వస్తుంది అని చెప్పి 40 మంది గ్రామస్థులను తీసుకెళ్లి మరి రోడ్డు పనులు మొదలు పెట్టాడు అనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదిలాఉంటే ఇట్టి విషయమై సర్పంచ్ భర్తను వివరణ కోరగా, నా గ్రామానికి నేను రోడ్డు వేయడానికి నియమ నిబంధనలు ఎందుకు పాటించాలి అంటూ నిర్లక్షపు సమాధానం చెబుతున్న పరిస్థితి. పైగా ఎలాంటి తీర్మానం చేయకుండానే సొంత నిర్ణయం తీసుకొని గ్రామా పంచాయితీ నిధులతో నుండి రోడ్డు వేస్తున్నాను తప్పేంటి అని ఎదురు ప్రశ్నలు వేయడం గమనార్హం. కనీసం స్థానిక పెద్ద దృష్టికి కూడా తీసుకెళ్లకుండానే ఇక్కడ నేనే రాజు నేనే మంత్రి అనేలా ప్రవర్తించడం చూస్తుంటే సారూ రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు.
40 పీట్ల రోడ్డు వేస్తే ముఖ్యంగా రియల్టర్ భూమి విలువ పెరుగుతుంది. నాగసాన్ పల్లి గ్రామానికి బస్సు వస్తుంది. కానీ మోత్కుపల్లి గ్రామానికి చెందిన రైతుల పరిస్థితి ఏంటి అనేదే అగమ్య గోచరంగా మారింది. ఈ రోడ్డు నిర్మాణం కారణంగా ఒక్కొక్కరి పట్టా భూమిలో నుండి 5, 10 గుంటలు అంతకు మించే భూమి కోల్పోతున్న పరిస్థితి. దాంతో మా గోడు ఎవరికీ చెప్పుకోవాలి..? మాకు దిక్కెవరు..? ఈ రోడ్డు నిర్మాణ పనులను ఆపేది ఎవరు అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.