పారిశుధ్య కార్మికులకు శానిటరీ న్యాప్‌కిన్స్ పంపిణీ
దిశ, న్యూస్ బ్యూరో: కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో పేదలు, అనాథలు, నిరుద్యోగులు, వలస కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వంతో పాటు దాతలు కూడా విరివిగా అన్నదానాలు, నిత్యవసరాలు పంపిణీ చేస్తున్నారని జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. నిరుపేద మహిళల ఆరోగ్య సంరక్షణకు శానిటరీ న్యాప్‌కిన్స్ అందజేసిన కార్పొరేటర్ ఆయేషా రుబీనాను మేయర్ అభినందించారు. శుక్రవారం జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో మేయర్ బొంతు రామ్మోహన్ సమక్షంలో శానిటరీ కార్మికులకు మేయర్ సతీమణి బొంతు శ్రీదేవి యాదవ్, […]
దిశ, న్యూస్ బ్యూరో: కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో పేదలు, అనాథలు, నిరుద్యోగులు, వలస కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వంతో పాటు దాతలు కూడా విరివిగా అన్నదానాలు, నిత్యవసరాలు పంపిణీ చేస్తున్నారని జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. నిరుపేద మహిళల ఆరోగ్య సంరక్షణకు శానిటరీ న్యాప్‌కిన్స్ అందజేసిన కార్పొరేటర్ ఆయేషా రుబీనాను మేయర్ అభినందించారు. శుక్రవారం జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో మేయర్ బొంతు రామ్మోహన్ సమక్షంలో శానిటరీ కార్మికులకు మేయర్ సతీమణి బొంతు శ్రీదేవి యాదవ్, కార్పొరేటర్లు ఆయేషా రుబీనా, మమత గుప్తా, విజయలక్ష్మి, హేమలత, పరమేశ్వరీ సింగ్‌లు శానిటరీ న్యాప్‌కిన్స్ పంపిణీ చేశారు. మహిళా కార్పొరేటర్లు నగరంలోని అన్ని స్లమ్ ఏరియాల్లో ఉన్న మహిళలకు స్వచ్ఛంద సంస్థల సహకారంతో శానిటరీ న్యాప్‌కిన్స్ పంపిణీ చేయాలని ఈ సందర్భంగా మేయర్ కోరారు. ఎస్.డి.ఐ.ఎఫ్ సంస్థ సహకారంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. ఈ అంశంలో మహిళల ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని సూచించారు.
Tags : Sanitary workers, Lockdown, Sanitary Napkins, GHMC Mayor, Corporator