అమ్మతనం అనుభవాలను పంచుకోనున్న సానియా
దిశ, స్పోర్ట్స్: ప్రపంచ అథ్లెట్లతో టెన్నిస్ స్టార్ సానియా మీర్జా లైవ్ సెషన్‌లో పాల్గొననున్నారు. ఆ కార్యక్రమంలో టెన్నిస్ ప్లేయర్‌గా, అమ్మగా తన అనుభవాలను పంచుకోనున్నారు. ఈనెల 24 నుంచి ప్రారంభంకానున్న ‘సమ్మర్ ఫెస్టివల్ ఆఫ్ ఒలింపియన్ అండ్ పారా ఒలింపియన్ ఆన్‌లైన్ ఎక్స్‌ప్రెస్’ అనే కార్యక్రమంలో ఆమె పాల్గొననున్నది. ఏడాదిపాటు టోక్యో ఒలింపిక్స్ వాయిదా పడిన కారణంగా క్రీడాకారుల్లో స్ఫూర్తిని నింపడం కోసం అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఓసీ) లైవ్ సెషన్ ఏర్పాటు చేసింది. ఈ […]
దిశ, స్పోర్ట్స్: ప్రపంచ అథ్లెట్లతో టెన్నిస్ స్టార్ సానియా మీర్జా లైవ్ సెషన్‌లో పాల్గొననున్నారు. ఆ కార్యక్రమంలో టెన్నిస్ ప్లేయర్‌గా, అమ్మగా తన అనుభవాలను పంచుకోనున్నారు. ఈనెల 24 నుంచి ప్రారంభంకానున్న ‘సమ్మర్ ఫెస్టివల్ ఆఫ్ ఒలింపియన్ అండ్ పారా ఒలింపియన్ ఆన్‌లైన్ ఎక్స్‌ప్రెస్’ అనే కార్యక్రమంలో ఆమె పాల్గొననున్నది. ఏడాదిపాటు టోక్యో ఒలింపిక్స్ వాయిదా పడిన కారణంగా క్రీడాకారుల్లో స్ఫూర్తిని నింపడం కోసం అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఓసీ) లైవ్ సెషన్ ఏర్పాటు చేసింది. ఈ నెల 28న శారీరక, మానసిక ఆరోగ్యంపై సానియా మీర్జా మాట్లాడనున్నది. అథ్లెట్‌గా, అమ్మగా సమస్యలను అధిగమించిన తీరును వెల్లడించనున్నది. సింగిల్స్‌లో రెండు గ్రాండ్‌స్లామ్‌ల విజేత నవోమి ఒసాకా, బాస్కెట్‌బాల్ ప్లేయర్ హచిమురా, స్టార్ అథ్లెట్లు కొలిన్ జాక్సన్, అలీసన్ ఫెలిక్స్ తదితరులు ఆన్‌లైన్ సెషన్‌లో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాన్ని ఒలింపిక్ యూట్యూబ్ చానెల్‌లో ప్రసారం చేయనున్నారు.