సల్మాన్ పెళ్లి ఫిక్స్.. కానీ !
దిశ, సినిమా: సీనియర్ హీరోయిన్ సంగీత బిజ్లాని.. మీడియా, మ్యాగజైన్స్ ఇతర సెలబ్రిటీలతో లింక్ అప్ చేస్తూ వార్తలు ప్రచురించడాన్ని గుర్తుచేసుకుంది. అలాంటి స్టోరీస్ చదివి భయపడి పోయేదాన్నని, కనీసం ఒక్కసారి కూడా చూడని వ్యక్తితో కూడా రిలేషన్ మెంటెయిన్ చేస్తున్నట్లు రాయడం బాధ కలిగించేదని వివరించింది. కాగా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ను నవంబర్ 14, 1996లో పెళ్లి చేసుకున్న ఆమె.. 2010లో విడిపోయింది. అంతకు ముందే దాదాపు పదేళ్ల పాటు సల్మాన్ ఖాన్‌తో రిలేషన్షిప్లో […]
దిశ, సినిమా: సీనియర్ హీరోయిన్ సంగీత బిజ్లాని.. మీడియా, మ్యాగజైన్స్ ఇతర సెలబ్రిటీలతో లింక్ అప్ చేస్తూ వార్తలు ప్రచురించడాన్ని గుర్తుచేసుకుంది. అలాంటి స్టోరీస్ చదివి భయపడి పోయేదాన్నని, కనీసం ఒక్కసారి కూడా చూడని వ్యక్తితో కూడా రిలేషన్ మెంటెయిన్ చేస్తున్నట్లు రాయడం బాధ కలిగించేదని వివరించింది. కాగా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ను నవంబర్ 14, 1996లో పెళ్లి చేసుకున్న ఆమె.. 2010లో విడిపోయింది. అంతకు ముందే దాదాపు పదేళ్ల పాటు సల్మాన్ ఖాన్‌తో రిలేషన్షిప్లో కూడా ఉన్నట్లు మీడియా ప్రచారం చేసింది.
ఈ విషయంపై గతంలో కాఫీ విత్ కరణ్ షోలో ఓపెన్ అయ్యాడు సల్మాన్. సంగీత బిజ్లానితో మ్యారేజ్ విషయంలో.. వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ అయ్యాక పెళ్లి ఆగిపోయిందని, తను బెస్ట్ బాయ్ ఫ్రెండ్‌గా ఉండగలను అనిపించిందని అందుకే అలా జరిగిపోయిందని తెలిపాడు. ఇక ఇప్పటి హీరోయిన్స్ మాదిరిగా కాకుండా తాను హీరోయిన్గా ఉన్నప్పుడు అమ్మనే తనతో పాటు సెట్స్‌కు తీసుకువెళ్ళేదని, తను ఉంటే సెక్యూర్‌గా ఫీల్ అయ్యేదాన్నని చెప్పింది సంగీత.