కరోనా ఫ్రీ జిల్లాగా సంగారెడ్డి
దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా కరోనా ఫ్రీ జిల్లాగా నిలిచిందని జిల్లా కలెక్టర్ ఎం.హనుమంతరావు తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో బాధితులు కోలుకొని డిశ్చార్జి అయినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. దీంతో ప్రస్తుతం జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు కూడా లేదన్నారు. అయినప్పటికీ ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలన్నారు. కిరాణా, మందుల దుకాణాలు, కూరగాయల మార్కెట్ల దగ్గర సామాజిక దూరం విధిగా పాటించాలన్నారు. వేరుశనగ కొనుగోళ్లకు అనుమతి.. సంగారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ముంపు […]
దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా కరోనా ఫ్రీ జిల్లాగా నిలిచిందని జిల్లా కలెక్టర్ ఎం.హనుమంతరావు తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో బాధితులు కోలుకొని డిశ్చార్జి అయినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. దీంతో ప్రస్తుతం జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు కూడా లేదన్నారు. అయినప్పటికీ ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలన్నారు. కిరాణా, మందుల దుకాణాలు, కూరగాయల మార్కెట్ల దగ్గర సామాజిక దూరం విధిగా పాటించాలన్నారు.
వేరుశనగ కొనుగోళ్లకు అనుమతి..
సంగారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ముంపు భూముల్లో రైతులు పండించిన వేరుశనగ పంట కొనుగోలుకు కలెక్టర్ హనుమంతరావు అనుమతి ఇచ్చారు. ప్రాజెక్టు సరిపడినంత నీరు లేకపోవడంతో కేవలం 350 ఎకరాల్లోనే రైతులు పంటను సాగు చేశారు. పట్టా భూమి కాకపోవడంతో గతంలోనూ కొనుగోళ్లను నిలిపివేశారు. ప్రస్తుతం కలెక్టర్ అనుమతి ఇవ్వడంతో రైతులకు ఊరట లభించింది.
Tags: carona, free distric, sangareedy, collector, ts news