హైదరాబాద్‌లో గంధపు చెట్లు నరికివేత కలకలం
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ ఇందిరాపార్క్‌లో గంధపు చెట్ల నరికివేత కలకలం సృష్టిస్తోంది. ఆదివారం మధ్యాహ్నం 13గంధపు చెట్లను పార్క్ సిబ్బంది కట్టర్‌తో కట్ చేయగా.. మరోసటి రోజు కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. గంధపు చెట్ల మాయంపై పార్క్ సిబ్బందిపైనే మేనేజ్‌మెంట్ అనుమానం వ్యక్తం చేస్తూ గాంధీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి దగ్గర్లోని సీసీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. సిబ్బందే గంధపు చెట్లను మాయం చేసిందా లేకుంటే ఇంకా ఎవరి […]
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ ఇందిరాపార్క్‌లో గంధపు చెట్ల నరికివేత కలకలం సృష్టిస్తోంది. ఆదివారం మధ్యాహ్నం 13గంధపు చెట్లను పార్క్ సిబ్బంది కట్టర్‌తో కట్ చేయగా.. మరోసటి రోజు కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. గంధపు చెట్ల మాయంపై పార్క్ సిబ్బందిపైనే మేనేజ్‌మెంట్ అనుమానం వ్యక్తం చేస్తూ గాంధీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి దగ్గర్లోని సీసీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. సిబ్బందే గంధపు చెట్లను మాయం చేసిందా లేకుంటే ఇంకా ఎవరి హస్తమైనా ఉందా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. గతంలోనూ ఇందిరాపార్క్‌లో గంధపు చెట్లను నరికిన తర్వాత మాయం అయిన సంఘటనలు చోటు చేసుకున్నాయి.