రెచ్చిపోతున్న ఇసుక దొంగలు.. వెలవెలబోతున్న వాగులు
దిశ, భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూర్ మండలంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. వాగులు ఇసుకాసురులకు కాసుల పంట కురిపిస్తోంది. దీం తో అక్రమ ఇసుక రవాణా మూడు పువ్వులు ఆరు కా యలుగా సాగుతోంది. స్థానికంగా పేడోడు ఇల్లు క ట్టుకుండామంటే ఇసుక తీయొద్దనే నిభందనలు ఇసుక మాఫియాలకుమాత్రం ఏ నిభందనలు అడ్డురావడంలేదు. బిక్కురు వాగు పరిసర ప్రాంతాల నుం చి ఇసుక తరలిస్తే భూగర్భజలాలు అడుగంటుతాయన్న కారణంతో ప్రభుత్వ హయాంలో వాల్టా […]
దిశ, భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూర్ మండలంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. వాగులు ఇసుకాసురులకు కాసుల పంట కురిపిస్తోంది. దీం తో అక్రమ ఇసుక రవాణా మూడు పువ్వులు ఆరు కా యలుగా సాగుతోంది. స్థానికంగా పేడోడు ఇల్లు క ట్టుకుండామంటే ఇసుక తీయొద్దనే నిభందనలు ఇసుక మాఫియాలకుమాత్రం ఏ నిభందనలు అడ్డురావడంలేదు. బిక్కురు వాగు పరిసర ప్రాంతాల నుం చి ఇసుక తరలిస్తే భూగర్భజలాలు అడుగంటుతాయన్న కారణంతో ప్రభుత్వ హయాంలో వాల్టా చట్టా న్ని తీసి ఇసుక తవ్వకాలు అనుమతులను నిలిపివేసింది. తదనంతరం మారిన ప్రభుత్వాలు వాగు వెం ట ఉన్న భూములు వరదలకు ఇసుక మేటకమ్మి నష్టపోతున్నారని, తద్వారా ఇసుక తోడి భూమిని సాగు చేసుకోవచ్చని నిబంధనలు సడలించి పట్టాదారుల పేరుమీద ఇసుక తీసే విధంగా అనుమతులు ఇచ్చిం ది. ఇదే కాకుండా ప్రభుత్వ ప్రాజెక్టుల నిర్మాణాల పేరుతో ఇసుకతీయడానికి అనుమతులు ఉన్నాయి.. దీనిని అదనుగా తీసుకున్న అధికారపార్టీల నేతల అండ దండలతో ఇసుక మాఫియా ఇసుకను యథేచ్ఛగా తోడేస్తున్నారు. దీంతో ఛోటామోటా నాయకుల నుంచి మొదలుకొని అధికారుల జేబులు కాసులతో గల గలలాడుతున్నాయి.
యాదాద్రి-భువనగిరి జిల్లా అడ్డగూడూర్ మండలంలోని లక్ష్మీదేవికాల్వ.. వర్ధమానుకోట గ్రామాల మధ్య నున్న వాగు నుంచి సూర్యాపేట జిల్లా నాగారం మం డలం పెరబోయిన గూడెం గ్రామం మీదుగా లారీల ద్వారా ఇసుక తీసుకెళ్లేందుకు అనుమతులిచ్చారని కొంతమంది బడా రైతులను మచ్చిక చేసుకొని భూముల నుంచి నేరుగా బిక్కురు వాగులోకి మట్టి రోడ్లు నిర్మించి కొంత కాలంగా లారీల్లో ఇసుక తరలిస్తున్నారు. లక్ష్మీదేవి గ్రామానికి చెందిన రైతులు ఇసుక తీయ డం వల్ల తమ బోర్లు వట్టి పోతాయని బిక్కేరువాగు నించి తీయొద్దని ఇటీవల అభ్యంతరం వ్యక్తం చేసిన పాపానికి నాగారం పోలీసులు అదుపులోకి తీసుకుని పూచికప్తె వదిలిపెట్టారు. వెలితే.. లక్మీదేవికాల్వ-వర్దమానుకోట గ్రామాల మధ్యలో బిక్కేరు లో ఇసుక క్వారీ ఏర్పాటు చేసి ఆంధ్రప్రాంతానికి చెందిన ఓ నాయకుడి బంధువుకు ప్రభుత్వం కాంట్రా క్టు అప్పజెప్పింది. మా వెనుక కేటీఆర్, మంత్రుల మా వెంట ఉన్నారని మీరెంత రాద్దాంతం చేసినా ఇసుక ఆగదని, అవసరమైతే పోలీసుల సహకారంతో ఇసుక తీసుకుపోతామని భయబ్రాంతులకు గురి చేస్తూ ఇసుక తరలిస్తున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగారంమండల పరిధిలో ఇసుక అనుమతిస్తే మా గ్రామ శివారులో ఎలా తీస్తారని లక్ష్మీదేవికాల్వ గ్రామ ఉప సర్పంచ్ కన్నెబొయిన గంగరాజుతో పాటు వళ్ళంబట్ల రవీందర్, పర్రెపాటి శంకర్ కాంట్రాక్టర్ ను నిలదీశారు. రెండు మండలా లకు సంబంధించిన ఇరు గ్రామాల సరిహ ద్దులు అధికారులు నిర్ణయించే వరకు ఇసుక తీయొద్దన్న పాపానికి నాగారం పోలీసులు వారిని అరెస్టు చేశారు.
ఫిర్యాదు చేసినా.. ఆగని ఇసుక రవాణా..
లక్ష్మీదేవి-వర్ధమానుకోట బిక్కేరు వాగు నుంచి ఇసుకతీయడం వల్ల ఆ ప్రాంతంలోని సుమారు వందలాది వ్యవసాయ బోర్లు ఎండిపోయి వందలాది రైతు కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబాలు రోడ్డున పడుతామని వెంటనే లక్ష్మీదేవి కాల్వ గ్రామరైతులు అడ్డ గుడూర్ తహసీల్దార్ రామకృష్ణకు రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయినప్పటికి ఇసుక తవ్వకాలు ఆగలేదు.
నిబంధనలు పాటించని కాంట్రాక్టర్..
ప్రభుత్వ నిబంధనల మేరకు ఇసుక కూలీల సాయం తో బిక్కెరు నుంచి రెండున్నర ఫీట్లకు మించి ఇసుక తీయరాదని, ఇక్కడి కాంట్రాక్టర్ మాత్రం కూలీలు లేకుండా యంత్రాలతో సుమారు ఐదారు ఫీట్ల ఇసుక ను తీసివాగులోనే కుప్పలు కుప్పలుగా డంపు చేసి ఇసుక తీసిన చోటకు నడివాగులోంచి ప్రొక్లెయిన్లతోఇసుకతెచ్చి నింపుతున్నారు. ఇసుక తీస్తున్న చోటతి ఎస్ఎండీసీ అధికారులు ఉదయం 9 గంటలనుంచి సాయంత్రం 6గంటల వరకు అక్కడే ఉండి ఇసుక తీయించాలి, అక్కడ అధికారులు ఎవరూ ఉండకపోవడంతో కాంట్రాక్టర్ తన ఇష్టారాజ్యంగా రాత్రి వేళ ల్లో సైతం నడి వాగు నుంచి ఇసుక తోడుతున్నా ప ట్టించుకునే వారులేరనే విమర్శలు లేక పోలేదు. అన్నింటి కన్నా ప్రధానంగా టీఎస్ఎండీసీ అధికారు లు ప్రతి లారీకి వే బిల్లు ఇవ్వాల్సి ఉంది. వారి కనుసైగల్లో గతం లో ఇచ్చిన ఒక వే బిల్లు మీదనే ఐదారు లారీలు వెళ్తున్నాయి. దీంతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండి పడుతుతుంది. ఉన్నతాధికారులు స్పందించి లక్ష్మీదేవి కాల్వ రైతులకు నష్టం జరగకుండా మాగ్రామ శివారులో తవ్వకా లు నిలిపి వేయాలని, నిబంధనల ప్రకారం అధికారులు వ్యవహరించాలని రైతులు కోరుతున్నారు.