చైనా నుంచి భారత్‌కు శాంసంగ్ డిస్‌ప్లే తయారీ యూనిట్
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ శాంసంగ్ తన డిస్‌ప్లే తయారీ యూనిట్‌ను చైనా నుంచి భారత్‌కు తరలిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. మెరుగైన పారిశ్రామిక పరిస్థితులు, పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాల నేపథ్యంలో చైనాలో ఉన్న డిస్‌ప్లే తయారీ యూనిట్‌ను ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు మార్చాలని నిర్ణయించినట్టు శాంసంగ్ సౌత్‌వెస్ ఏసియా ప్రెసిడెంట్, సీఈఓ కెన్ కాంగ్ స్పష్టం చేశారు. ఈ యూనిట్‌కు సంబంధించి నిర్మాణ పనుల ద్వారా భారత్ పట్ల సంస్థకున్న నిబంద్ధతను అద్దం పడతాయని, యూపీ […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ శాంసంగ్ తన డిస్‌ప్లే తయారీ యూనిట్‌ను చైనా నుంచి భారత్‌కు తరలిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. మెరుగైన పారిశ్రామిక పరిస్థితులు, పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాల నేపథ్యంలో చైనాలో ఉన్న డిస్‌ప్లే తయారీ యూనిట్‌ను ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు మార్చాలని నిర్ణయించినట్టు శాంసంగ్ సౌత్‌వెస్ ఏసియా ప్రెసిడెంట్, సీఈఓ కెన్ కాంగ్ స్పష్టం చేశారు. ఈ యూనిట్‌కు సంబంధించి నిర్మాణ పనుల ద్వారా భారత్ పట్ల సంస్థకున్న నిబంద్ధతను అద్దం పడతాయని, యూపీ రాష్ట్రాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని శాంసంగ్ ప్రతినిధి బృందం ఓ ప్రకటనలో పేర్కొంది.
‘మేక్ ఇన్ ఇండియా’ విజయానికి శాంసంగ్ కొత్త యూనిట్ సాక్ష్యమని, ఈ యూనిట్ ఏర్పాటు ద్వారా రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆశిస్తున్నట్టు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మీడియా సమావేశంలో చెప్పారు.