2022లో మళ్లొస్తాం..
తెలంగాణ కుంభమేళా అయిన మేడారం జాతర ప్రశాంతంగా ముగిసింది. శనివారం సాయంకాలం గిరిజన దేవతలు సమ్మక్క-సారలమ్మలిద్దరూ డప్పు వాయిద్యాలు, శివసత్తుల విన్యాసాలు, భారీ భద్రత నడుమ వనప్రవేశం చేశారు. మళ్లొచ్చే 2022 సంవత్సరంలో దర్శనమిస్తామంటూ భక్తులకు వీడ్కొలు పలికారు. రెండెండ్లకొకసరి వచ్చే దేవతలను కడసరిగా చూసుకుందామని చాలా మంది భక్తులు శనివారం కూడా క్యూలైన్లలో ఎదురుచూశారు. ఈ ఏడు జాతర సమయంలో కోటిన్నర జనాభా మేడారాన్ని సందర్శించి, అమ్మవార్లకు మొక్కులు […]
తెలంగాణ కుంభమేళా అయిన మేడారం జాతర ప్రశాంతంగా ముగిసింది. శనివారం సాయంకాలం గిరిజన దేవతలు సమ్మక్క-సారలమ్మలిద్దరూ డప్పు వాయిద్యాలు, శివసత్తుల విన్యాసాలు, భారీ భద్రత నడుమ వనప్రవేశం చేశారు. మళ్లొచ్చే 2022 సంవత్సరంలో దర్శనమిస్తామంటూ భక్తులకు వీడ్కొలు పలికారు. రెండెండ్లకొకసరి వచ్చే దేవతలను కడసరిగా చూసుకుందామని చాలా మంది భక్తులు శనివారం కూడా క్యూలైన్లలో ఎదురుచూశారు. ఈ ఏడు జాతర సమయంలో కోటిన్నర జనాభా మేడారాన్ని సందర్శించి, అమ్మవార్లకు మొక్కులు సమర్పించినట్టు తెలుస్తోంది. వనప్రవేశం అనంతరం జనసందోహం కొద్దికొద్దిగా తగ్గుముఖం పట్టింది. ఇదిలాఉండగా మేడారంలో ఉదయం నుంచి వర్షం పడుతోంది. సాయంకాలం నాటికి కుండపోత వర్షం కురవడంతో తడుస్తూనే భక్తులు దేవతలను దర్శించుకున్నారు.