విడాకులకు అవే కారణాలు? నేను మారాలి అంటున్న సమంత
దిశ, వెబ్డెస్క్ : టాలీవుడ్లో మోస్ట్ బ్యూటిఫుల్ జంటగా ఉంటూ.. ఎంతో మంది అభిమానుల మనుసులు దోచుకున్న చైతన్య, సామ్ విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించడంతో అక్కినేని అభిమానుల గుండెల్లో బండరాయి వేసినంత పనైంది. అయితే చైతన్య, సామ్ విడిపోవడానికి కారణాలేంటని సోషల్ మీడియాలో పెద్ద చర్చనే జరుగుతుంది. ఈ విషయం పై చైతన్య, సమంత ఎలా స్పందిస్తారని అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.. ఈ నేపథ్యంలో సమంత చేసిన పోస్టు ఆసక్తిగా మారింది. ప్రపంచాన్ని మార్చాలంటే నన్ను […]
దిశ, వెబ్డెస్క్ : టాలీవుడ్లో మోస్ట్ బ్యూటిఫుల్ జంటగా ఉంటూ.. ఎంతో మంది అభిమానుల మనుసులు దోచుకున్న చైతన్య, సామ్ విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించడంతో అక్కినేని అభిమానుల గుండెల్లో బండరాయి వేసినంత పనైంది. అయితే చైతన్య, సామ్ విడిపోవడానికి కారణాలేంటని సోషల్ మీడియాలో పెద్ద చర్చనే జరుగుతుంది.
ఈ విషయం పై చైతన్య, సమంత ఎలా స్పందిస్తారని అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.. ఈ నేపథ్యంలో సమంత చేసిన పోస్టు ఆసక్తిగా మారింది. ప్రపంచాన్ని మార్చాలంటే నన్ను నేను మార్చుకోవాలి..నా పనులన్నీ నేనే చేసుకోవాలంటూ సమంత ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. అంతే కాకుండా ప్రస్తుతం చేయాల్సిన పనులపై శ్రద్ధ పెట్టాలని, బద్ధకం వదిలి ముందుకు నడవాలంటూ ఏదో చెప్పేందుకు ప్రయత్నించినట్టు కనిపిస్తోంది. ఇది చదివిన వాళ్లు సమంత తాను ఒంటరిగా నిలబడి, తన లక్ష్యాలు, తన కలలను సాకారం చేసుకునేందుకు సమంత ఇలాంటి నిర్ణయం తీసుకుందని అనుకుంటున్నారు. అక్కినేని కుటుంబం ఆంక్షలు పెట్టిందని అందుకే ఇలా దూరం పెట్టేసినట్టు చెప్పుకుంటున్నారు. ఏదేమైనా సామ్-చై విడిపోవడం వారి అభిమానులకు మాత్రం బాధను మిగిల్చిందనే చెప్పాలి. సమంత పోస్ట్ పై స్పందించిన అభిమానులు.. ఒంటరిగా నిలబడి కలల్ని సాకారం చేసుకుంటా అంటున్న తమ ప్రియమైన నటికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.