విడాకుల తర్వాత సమంత గుడ్ న్యూస్.. కళ్లలో ఆ బాధ అలాగే కనిపిస్తోందిగా!
దిశ, వెబ్‌డెస్క్: గత కొద్ధి రోజులుగా సమంత టాక్ అఫ్ ది టౌన్ గా నిలిచిన విషయం తెలిసిందే.. నాగ చైతన్యతో విడాకుల అనంతరం ఆమెపై ఎన్నో ట్రోల్స్ వచ్చాయి. వాటిని సామ్ సమర్థవంతంగా ఎదుర్కొని స్ట్రాంగ్ గా నిలిచింది. ప్రస్తుతం సామ్ సినిమాలపైనే దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఒక భారీ ప్రాజెక్ట్ సైన్ చేసినట్లు కొన్నిరోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఆ వార్తలను నిజం చేస్తూ దసరా పండగ సందర్భంగా తన […]
దిశ, వెబ్‌డెస్క్: గత కొద్ధి రోజులుగా సమంత టాక్ అఫ్ ది టౌన్ గా నిలిచిన విషయం తెలిసిందే.. నాగ చైతన్యతో విడాకుల అనంతరం ఆమెపై ఎన్నో ట్రోల్స్ వచ్చాయి. వాటిని సామ్ సమర్థవంతంగా ఎదుర్కొని స్ట్రాంగ్ గా నిలిచింది. ప్రస్తుతం సామ్ సినిమాలపైనే దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఒక భారీ ప్రాజెక్ట్ సైన్ చేసినట్లు కొన్నిరోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఆ వార్తలను నిజం చేస్తూ దసరా పండగ సందర్భంగా తన కొత్త సినిమా అధికారిక ప్రకటన చేశారు మేకర్స్. ఇటీవల శాకుంతం లను పూర్తి చేసిన సామ్ తన తదుపరి చిత్రం డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌తో చేయనుంది.
డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ నిర్మాణంలో శాంతరూబన్ జ్ఞానశేఖరన్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఒక భిన్నమైన ప్రేమ కథగా ఈ మూవీ తెరకెక్కనున్నట్లు సమాచారం. విడాకుల తర్వాత సామ్ చేస్తోన్న మొదటి చిత్రం కావడంతో అందరి చూపు ఈ చిత్రంపైనే ఉంది. తమిళ్, తెలుగు లో ఈ సినిమా విదుదల కానుంది. అప్ డేట్ తో పాటు సామ్ పోస్టర్ ని కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. తీక్షమైన చూపుతో విచారంగా కనిపిస్తున్న సామ్ లుక్ ఆకట్టుకొంటుంది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. మరి విడాకుల తర్వాత సామ్ మరో హిట్ ని అందుకుంటుందా..? లేదా..? అనేది తెలియాలి.