సామ్, ఉపాసనల ‘ఆరోగ్య సూత్రాలు’

దిశ, వెబ్‌డెస్క్ : వైవిధ్యమైన చిత్రాలు, గుర్తుండిపోయే పాత్రలతో మంచి పేరు తెచ్చుకున్న నటి సమంత. పెళ్లి తర్వాత ఓ వైపు తన కెరీర్‌ను కొనసాగిస్తూనే.. మరోవైపు బిజినెస్‌లోనూ రాణిస్తోంది. ఇక రామ్ చరణ్ సతీమణి ఉపాసన సైతం ఫార్మా రంగంలో తనదైన ముద్ర వేస్తూనే ‘బి పాజిటివ్’ అనే హెల్త్ మ్యాగజైన్ నడుపుతోంది. ఇదేగాక తన పేరుతో నడిచే యూట్యూబ్ చానల్‌లోనూ హెల్తీ టిప్స్ అందిస్తోంది. అయితే అక్కినేని వారి కోడలు సమంత, కొణిదెల వారి […]

Update: 2020-09-21 06:10 GMT

దిశ, వెబ్‌డెస్క్ :
వైవిధ్యమైన చిత్రాలు, గుర్తుండిపోయే పాత్రలతో మంచి పేరు తెచ్చుకున్న నటి సమంత. పెళ్లి తర్వాత ఓ వైపు తన కెరీర్‌ను కొనసాగిస్తూనే.. మరోవైపు బిజినెస్‌లోనూ రాణిస్తోంది. ఇక రామ్ చరణ్ సతీమణి ఉపాసన సైతం ఫార్మా రంగంలో తనదైన ముద్ర వేస్తూనే ‘బి పాజిటివ్’ అనే హెల్త్ మ్యాగజైన్ నడుపుతోంది. ఇదేగాక తన పేరుతో నడిచే యూట్యూబ్ చానల్‌లోనూ హెల్తీ టిప్స్ అందిస్తోంది. అయితే అక్కినేని వారి కోడలు సమంత, కొణిదెల వారి కోడలు ఉపాసన.. ఇద్దరూ మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. కాగా, వీళ్లిద్దరూ కలిసి ఓ వెబ్‌సైట్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోమని చెబుతున్నారు.

గతంలో అపోలో హెల్త్ కేర్ పత్రిక, బి పాజిటివ్ మ్యాగజైన్ కోసం సమంతను స్పెషల్ ఇంటర్వ్యూ చేసిన ఉపాసన.. తాజాగా యువర్ లైఫ్ కో.ఇన్ (‘urlife_co_in) హెల్త్ బ్లాగ్‌ను ప్రారంభించింది. దీని ద్వారా హెల్తీ లైఫ్ స్టైల్ చాయిసెస్‌ ఎలా చేసుకోవాలో తెలుపుతూ.. ఉపాసన అండ్ టీమ్ టిప్స్ అందిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ హెల్త్ బ్లాగ్‌కు సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో సబ్‌స్క్రైబ్ చేసుకోమని అభిమానులకు చెప్పేందుకే తాజాగా సామ్, ఉపాసన కలిశారు. అంతేకాదు సామ్ కూడా త్వరలోనే.. బాడీ, మైండ్, హీలింగ్, న్యూట్రిషన్ తదితర అంశాలపై తన అభిప్రాయాలను పంచుకోనుంది.

ఇక సామ్ కెరీర్ విషయానికొస్తే.. ప్ర‌స్తుతం ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌తో బిజీగా ఉంది. మ‌నోజ్ బాజ్‌పేయి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న ఈ సిరీస్‌లో స‌మంత‌ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో క‌నిపించ‌నుంది.

https://twitter.com/upasanakonidela/status/1307293455731822593?ref_src=twsrc^tfw|twcamp^tweetembed|twterm^1307293455731822593|twgr^share_3&ref_url=https://telugu.news18.com/news/movies/samantha-akkineni-with-upasana-konidela-photo-go-viral-on-social-media-ta-609348.html

Tags:    

Similar News