అమెరికన్లను వణికిస్తున్న ఉల్లి, కారణమిదే…

దిశ, వెబ్ డెస్క్: భారతదేశంలో ఉల్లిపాయను ఆహార పదార్థాలలో ఎక్కువ ఉపయోస్తుంటారు. దాదాపు ప్రతి కూరలోనూ ఉల్లి ఘాటు ఉండాల్సిందే… అమెరికాలో కూడా ఆనియన్స్ వాడకం (consumption of onions) ఎక్కువే. కానీ ఇప్పుడు ఉల్లిపాయ అంటేనే వణుకుతున్నారు తెల్ల దొరలు. ఎందుకంటే ఈ ఉల్లిని తిని రోజు రోజుకీ అనారోగ్యం బారిన పడేవారి సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆ దేశంలో ఇప్పటికి 34 రాష్ట్రాల్లో 400 మంది అనారోగ్యం పాలయ్యారు. అమెరికా ఇటీవలే వివిధ దేశాల నుంచి అనేక రకాల ఉల్లిపాయలను దిగుమతి చేసుకుంది. ఇందులో ఎరుపు రంగు ఉల్లిపాయల్లో సాల్మొనెల్లా […]

Update: 2020-08-06 12:02 GMT

దిశ, వెబ్ డెస్క్: భారతదేశంలో ఉల్లిపాయను ఆహార పదార్థాలలో ఎక్కువ ఉపయోస్తుంటారు. దాదాపు ప్రతి కూరలోనూ ఉల్లి ఘాటు ఉండాల్సిందే… అమెరికాలో కూడా ఆనియన్స్ వాడకం (consumption of onions) ఎక్కువే. కానీ ఇప్పుడు ఉల్లిపాయ అంటేనే వణుకుతున్నారు తెల్ల దొరలు. ఎందుకంటే ఈ ఉల్లిని తిని రోజు రోజుకీ అనారోగ్యం బారిన పడేవారి సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆ దేశంలో ఇప్పటికి 34 రాష్ట్రాల్లో 400 మంది అనారోగ్యం పాలయ్యారు.

అమెరికా ఇటీవలే వివిధ దేశాల నుంచి అనేక రకాల ఉల్లిపాయలను దిగుమతి చేసుకుంది. ఇందులో ఎరుపు రంగు ఉల్లిపాయల్లో సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉన్నట్టు సిడిసి గుర్తించింది. ఈ ఉల్లిపాయాలను ఆహారంగా తీసుకున్న వారిలో డయేరియా లక్షణాలు కనిపిస్తున్నట్టు తెలిపింది. ఈ రకం ఉల్లిపాయలను థామ్సన్ ఇంటర్నేషనల్ కంపెనీ (Thomson International Company) సప్లై చేసింది. దీంతో ఈ కంపెనీ నుంచి వచ్చిన అన్నిరకాల ఉల్లిపాయలను వాడొద్దని సీడీసీ ప్రకటించింది. ఉల్లిపాయల నుంచి సాల్మొనెల్లా బ్యాక్టీరియా (Salmonella Bacteria) శరీరంలోకి ప్రవేశించడం వలన ఫుడ్ పాయిజన్ (Food poison) అవుతున్నట్టు వైద్య అధికారులు వెల్లడిస్తున్నారు.

Tags:    

Similar News