రైతులకు అండగా సజ్జనార్.. ఇక వారికి తిప్పలు తప్పినట్లే!
దిశ, డైనమిక్ బ్యూరో : ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ నియమితులైన రోజు నుంచి నిత్యం ఏదో కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తున్నారు. అంతేకాకుండా, ప్రయాణికుల సూచనలు వింటూ సంస్థలో కొత్త ఒరవడిని తీసుకొచ్చి రోజూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇదే క్రమంలో పండించిన పంటను తరలించేందుకు లారీలు దొరక్క ఇబ్బందులు పడుతున్న రైతుల గురించి సజ్జనార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా చేతికొచ్చిన తెల్లబంగారం పత్తిని మిల్లులకు తరలించేందుకు కార్గో బస్సులను ఏర్పాటు […]
దిశ, డైనమిక్ బ్యూరో : ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ నియమితులైన రోజు నుంచి నిత్యం ఏదో కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తున్నారు. అంతేకాకుండా, ప్రయాణికుల సూచనలు వింటూ సంస్థలో కొత్త ఒరవడిని తీసుకొచ్చి రోజూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇదే క్రమంలో పండించిన పంటను తరలించేందుకు లారీలు దొరక్క ఇబ్బందులు పడుతున్న రైతుల గురించి సజ్జనార్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈ సందర్భంగా చేతికొచ్చిన తెల్లబంగారం పత్తిని మిల్లులకు తరలించేందుకు కార్గో బస్సులను ఏర్పాటు చేసి రైతులకు ఉపశమనం కలిగించారు. అందులో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా పత్తిని తరలిస్తున్న కార్గో వాహనం ఫొటోను సజ్జనార్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. కార్గో వాహనాల కోసం ఆ జిల్లా రైతులు ‘‘9154298693, 9154298696’’ ఈ నెంబర్లకు సంప్రదించాలని కోరారు. సజ్జనార్ తాజా నిర్ణయంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సదుపాయాన్ని అన్ని జిల్లాల్లో త్వరగా అమలు చేయాలని కోరుతున్నారు.
ఉమ్మడి నల్లగొండ పత్తి రైతులకు శుభ వార్త, కార్గో వెహికిల్ ద్వారా మీరు కోరుకున్న పాయింట్ వద్ద లోడ్ చేసుకొని కోరిన చోట అన్లోడ్ చేయబడును కార్గోలారీల ద్వారా, కావున రైతులు సంప్రదించవలసిన మొబైల్ నంబర్స్ 9154298693, 9154298696 @tsrtcmdoffice pic.twitter.com/xmlToF4sc7
— RME…NLG CARGO (@tsrtccargonlg) November 1, 2021