చంద్రబాబుపై సజ్జల ఫైర్..ఎందుకంటే
దిశ వెబ్ డెస్క్: సహజవాయువుపై వ్యాట్ పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై చంద్రబాబు వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఖండించారు. వాస్తవాలను తెలుసుకోకుండానే ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నాలను చంద్రబాబు చేస్తున్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వ పథకాలపై చంద్రబాబు అసత్యాలు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ఇక వ్యాట్ పెంపు జీవో ను చదువ కుండానే నారా లోకేశ్ ట్వీట్ చేసారని చెప్పారు. సీఎన్జీకీ, ఎల్పీజీకీ తేడా కూడా నారా లోకేశ్ కు తెలియదని […]
దిశ వెబ్ డెస్క్:
సహజవాయువుపై వ్యాట్ పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై చంద్రబాబు వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఖండించారు. వాస్తవాలను తెలుసుకోకుండానే ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నాలను చంద్రబాబు చేస్తున్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వ పథకాలపై చంద్రబాబు అసత్యాలు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ఇక వ్యాట్ పెంపు జీవో ను చదువ కుండానే నారా లోకేశ్ ట్వీట్ చేసారని చెప్పారు. సీఎన్జీకీ, ఎల్పీజీకీ తేడా కూడా నారా లోకేశ్ కు తెలియదని చెప్పారు.
రాజధాని కోసం చంద్రబాబు వసూలు చేసిన చందాలు ఏమయ్యాయని అన్నారు. బలవంతపు సేకరణ చేసి రైతులను చంద్రబాబు మోసం చేశారని అన్నారు. రాష్ట్రంలో కరోనా ఉదృతి ఉందనీ, అనివార్య పరిస్థితుల్లోనే వ్యాట్ పెంచాల్సి వచ్చిందని ఆయన తెలిపారు.