థాయిలాండ్ ఓపెన్‌లో సైనా, శ్రీకాంత్ ముందుకు
దిశ, స్పోర్ట్స్ : బ్యాంకాక్‌లో జరుగుతున్న థాయిలాండ్ ఓపెన్‌లో భారత షట్లర్లకు ఊరట కలిగింది. తొలి రోజు జరిగిన మొదటి రౌండ్‌లో పీవీ సింధు, సాయి ప్రణీత్ ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించారు. కాగా, కరోనా పాజిటివ్ వచ్చిందని సైనా నెహ్వల్, హెచ్ఎస్ ప్రణయ్‌ను తొలి రౌండ్ ఆడనివ్వలేదు. కాగా, నాలుగో టెస్టులో వీరిద్దరూ నెగెటివ్ అని తేలడంతో బుధవారం తొలి రౌండ్ మ్యాచ్‌లు ఆడారు. బుధవారం నాడు ప్రపంచ మాజీ నెంబర్ వన్ కిదాంబి శ్రీకాంత్ […]
దిశ, స్పోర్ట్స్ : బ్యాంకాక్‌లో జరుగుతున్న థాయిలాండ్ ఓపెన్‌లో భారత షట్లర్లకు ఊరట కలిగింది. తొలి రోజు జరిగిన మొదటి రౌండ్‌లో పీవీ సింధు, సాయి ప్రణీత్ ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించారు. కాగా, కరోనా పాజిటివ్ వచ్చిందని సైనా నెహ్వల్, హెచ్ఎస్ ప్రణయ్‌ను తొలి రౌండ్ ఆడనివ్వలేదు. కాగా, నాలుగో టెస్టులో వీరిద్దరూ నెగెటివ్ అని తేలడంతో బుధవారం తొలి రౌండ్ మ్యాచ్‌లు ఆడారు.
బుధవారం నాడు ప్రపంచ మాజీ నెంబర్ వన్ కిదాంబి శ్రీకాంత్ తన సహచర భారతీయ ఆటగాడు సౌరభ్ వర్మతో తలపడి 21-12, 21-11 వరుస గేమ్స్‌తో విజయం సాధించి రెండో రౌండ్లో ప్రవేశించాడు. ఇక పారుపల్లి కశ్యప్ తొలత వాకోవర్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. కానీ బుధవారం తొలి రౌండ్‌లో జేసన్ ఆంథోనీతో మ్యాచ్ ఆడాడు. అయితే మూడో గేమ్‌లో తొడ కండరాలు పట్టేయడంతో మ్యాచ్ నుంచి అర్ధాంతరంగా నిష్క్రమించాడు. మరోవైపు కరోనా నెగెటివ్ వచ్చిన హెచ్ఎస్ ప్రణయ్ మలేషియాకు చెందిన లీ ఝీ జియాతో తొలి రౌండ్‌లో తలపడ్డాడు. అయితే జియా 21-15, 21-17 తేడాతో ప్రణయ్‌ను ఓడించి రెండో రౌండ్‌కు చేరుకున్నాడు.
మహిళల సింగిల్స్‌లో ఆశాదీపంగా మిగిలిన సైనా నెహ్వాల్ తొలి రౌండ్‌లో మలేషియాకు చెందిన కిసోనా సెల్వదురైతో తలపడింది. కరోనా కష్టాల మధ్య సైనా ఈ మ్యాచ్‌లో అలవోకగా పై చేయి సాధించింది. వరుసగా 21-15, 21-15 తేడాతో కిసోనా సెల్వదురైపై విజయం సాధించి రెండో రౌండ్‌లో ప్రవేశించింది.
మహిళల డబుల్స్ జంట అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డి తొలి రౌండ్‌లోనే నిష్క్రమించారు. ఇక మిక్స్‌డ్ డబుల్స్‌లో సాత్విక్ సాయి రాంకీరెడ్డి, అశ్విని పొన్నప్పు గురువారం నాడు తమమ రెండో రౌండ్ ఆడనున్నారు. మెన్స్ డబుల్స్‌లో కూడా సాత్వీక్‌సాయిరాజ్, చిరాగ్ జంట గురువారం రెండో రౌండ్ మ్యాచ్ ఆడనున్నది.