అంబానీ ఇంటి వద్ద బాంబు కేసు.. సచిన్ వాజే అరెస్టు
ముంబయి: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంటి వద్ద బాంబు కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముంబయి పోలీసు అధికారి, ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ సచిన్ వాజేను జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఐఎ) అరెస్టు చేసింది. శనివారం ఆయనను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఎ అధికారులు సుమారు 11 గంటల పాటు విచారించారు. అనంతరం ఆయనను కోర్టు ముందు హాజరుపరిచి తమ కస్టడీకి అప్పగించాలని కోరారు. కేసు ప్రాధాన్యత దృష్ట్యా సచిన్ వాజేను ఈనెల 25 […]
ముంబయి: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంటి వద్ద బాంబు కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముంబయి పోలీసు అధికారి, ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ సచిన్ వాజేను జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఐఎ) అరెస్టు చేసింది. శనివారం ఆయనను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఎ అధికారులు సుమారు 11 గంటల పాటు విచారించారు. అనంతరం ఆయనను కోర్టు ముందు హాజరుపరిచి తమ కస్టడీకి అప్పగించాలని కోరారు. కేసు ప్రాధాన్యత దృష్ట్యా సచిన్ వాజేను ఈనెల 25 దాకా కస్టడీకి అప్పగిస్తూ ముంబయిలోని ఓ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరిన వాజే అభ్యర్థనను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోలేదు. కస్టడీ విచారణ తప్పనిసరి అని తెలిపింది.
ఫిబ్రవరి 25న ముంబయిలోని అంబానీ నివాసం ఎదుట జిలిటెన్ స్టిక్స్‌తో ఉన్న స్కార్పియో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేస్తుండగా స్కార్పియో యజమాని మాన్సుఖ్ హిరేన్ థానేలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతడి మృతి వెనుక ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు వాజే హస్తముందని ఆరోపిస్తూ హిరేన్ భార్య ఫిర్యాదు చేయడం, అంతేగాక ఈ కేసుపై బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అనుమానం వ్యక్తం చేయడంతో ముంబయి పోలీసులు ఈ కేసును ఎన్ఐఎకు అప్పగించారు.