17న శబరిమల టెంపుల్ ఓపెన్
తిరువనంతపురం: కేరళలోని శబరిమల ఆలయం ఈ నెల 17న తెరుచుకోనుంది. మాసం పూజల కోసం అయ్యప్ప ఆలయాన్ని 17 నుంచి 21వ తేదీ వరకు తెరవబోతున్నట్టు అధికారులు వెల్లడించారు. దేవుడి దర్శనానికి భక్తులు రెండు డోసుల టీకా వేసుకుని ఉండాలని లేదా 48 గంటలకు ముందు చేసిన ఆర్టీపీసీఆర్ టెస్టు కరోనా నెగెటివ్ రిపోర్ట్ అయినా సమర్పించాలని షరతు పెట్టారు. కేరళలో కరోనా కేసులు ఇంకా తగ్గుముఖం పట్టని సంగతి తెలిసిందే. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న 5వేల […]
తిరువనంతపురం: కేరళలోని శబరిమల ఆలయం ఈ నెల 17న తెరుచుకోనుంది. మాసం పూజల కోసం అయ్యప్ప ఆలయాన్ని 17 నుంచి 21వ తేదీ వరకు తెరవబోతున్నట్టు అధికారులు వెల్లడించారు. దేవుడి దర్శనానికి భక్తులు రెండు డోసుల టీకా వేసుకుని ఉండాలని లేదా 48 గంటలకు ముందు చేసిన ఆర్టీపీసీఆర్ టెస్టు కరోనా నెగెటివ్ రిపోర్ట్ అయినా సమర్పించాలని షరతు పెట్టారు. కేరళలో కరోనా కేసులు ఇంకా తగ్గుముఖం పట్టని సంగతి తెలిసిందే. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న 5వేల మంది భక్తులకు ఆలయంలోకి అనుమతిస్తామని అధికారులు తెలిపారు. శనివారం ఒక్క రోజే రాష్ట్రంలో 14వేల కేసులు నమోదవడం గమనార్హం.