నేరస్థుడ్ని పట్టుకోమని పంపిస్తే.. అతడితోనే రాసలీలలు సాగిస్తూ
దిశ, వెబ్‌డెస్క్: జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. ఇక ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో తెలియదు. ఈ ప్రేమలో పడితే.. ఎదుటివారు నిందితుడా..? హంతకుడా..? దొంగా..? అనేది ఏది కనిపించదు. అందుకే అంటారేమో ప్రేమ గుడ్డిది అని. ఈ మాట చాలామంది విషయంలో రుజువు అయ్యింది. తాజాగా అలాంటి ఘటనే రష్యాలో వెలుగుచూసింది. నిందితుడిని పట్టుకోమని ఓ మహిళా అధికారికి కేసు అప్పగిస్తే.. ఏకంగా ఆ నిందితుడితోనే ప్రేమలో పడి పోలీసులకే షాక్ ఇచ్చింది […]
దిశ, వెబ్‌డెస్క్: జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. ఇక ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో తెలియదు. ఈ ప్రేమలో పడితే.. ఎదుటివారు నిందితుడా..? హంతకుడా..? దొంగా..? అనేది ఏది కనిపించదు. అందుకే అంటారేమో ప్రేమ గుడ్డిది అని. ఈ మాట చాలామంది విషయంలో రుజువు అయ్యింది. తాజాగా అలాంటి ఘటనే రష్యాలో వెలుగుచూసింది. నిందితుడిని పట్టుకోమని ఓ మహిళా అధికారికి కేసు అప్పగిస్తే.. ఏకంగా ఆ నిందితుడితోనే ప్రేమలో పడి పోలీసులకే షాక్ ఇచ్చింది ఓ మహిళా అధికారి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఎలా ఉన్నాయి.
మదీనా సుకెనోవాకు స్పై ఏజెంట్ గా పనిచేయడం చాలా ఇష్టం. దానికోసం ఎంతో కష్టపడి చదివి రష్యా స్పై ఏజెంట్ గా జాబ్ ని అందుకొని విధులలో జాయిన్ అయ్యింది. ఇక మొదటి కేసుగా ఆమెకు మిఖాయిల్ సెర్బిన్ అనే నిందితుడిపై నిఘా పెట్టి సమాచారాన్ని అందించవల్సిందిగా అధికారులు ఆదేశించారు. ఇక రోజు మిఖాయిల్ సెర్బిన్ ని ఫాలో అవ్వడమే మదీనా పని. అలా జరుగుతున్న క్రమంలో ఆమె నిందితుడితో ప్రేమలో పడిపోయింది. ఇక వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరగడం మొదలుపెట్టారు. అంతేకాకుండా అతడి మీద ఉన్న ప్రేమకు గుర్తుగా ఒక కారును కూడా గిఫ్టుగా ఇచ్చింది.
రోజూ క్రిమినల్ ప్రియుడు.. పోలీస్ ప్రేయసి ఇంటికి వచ్చిపోతూ ఉండడంపై అధికారులు కనిపెట్టారు. అంతేకాకుండా వీరిద్దరి రాసలీలలు చేస్తూ కనిపించారు. ఇంకేముంది మదీనాను విచారించగా.. ఈ కేసును తాను చూడలేనని.. వేరే వారికి అప్పజెప్పాలని గతంలోనే చెప్పినట్లుగా ఆమె చెప్పారు. కేసు చూడనని చెప్పిందే కానీ.. ప్రేమలో పడినట్లు చెప్పలేదు కదా? అన్న ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పలేదట. ఏదిఏమైనా ఆమె చేసింది తప్పే కాబట్టి.. ఆమెపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ 24 ఏళ్ల స్పై ఏజెంట్ ప్రేమకథ స్థానికంగా సంచలనం రేపుతోంది.