‘రుద్రం-1’ క్షిపణి ప్రయోగం గ్రాండ్ సక్సెస్..

దిశ, వెబ్‌డెస్క్: పొరుగు దేశాలతో పొంచియున్న ప్రమాదం నేపథ్యంలో భారత రక్షణ వ్యవస్థ వీలైనంత త్వరగా ఆధునాతన క్షిపణి వ్యవస్థను సమకూర్చుకుంటోంది. నిన్నఅస్త్ర, శౌర్య, స్మార్ట్ క్షిపణి వ్యవస్థను విజయవంతంగా ప్రయోగించిన DRDO తాజాగా రుద్రం-1 క్షిపణిని లాంచ్ చేసింది. ఒడిశాలోని బాలాసోర్ కేంద్రంగా శుక్రవారం ప్రయోగించిన రుద్రం-1 క్షిపణి సక్సెస్ అయ్యిందని డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు తెలిపారు. రుద్రం-1 విజయవంతం కావడంతో శత్రుదేశాల రాడార్లను మట్టి కరిపించగల శక్తి భారత్ కైవసం చేసుకుందని తెలుస్తోంది. ఇది సుఖోయ్-30 […]

Update: 2020-10-09 09:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: పొరుగు దేశాలతో పొంచియున్న ప్రమాదం నేపథ్యంలో భారత రక్షణ వ్యవస్థ వీలైనంత త్వరగా ఆధునాతన క్షిపణి వ్యవస్థను సమకూర్చుకుంటోంది. నిన్నఅస్త్ర, శౌర్య, స్మార్ట్ క్షిపణి వ్యవస్థను విజయవంతంగా ప్రయోగించిన DRDO తాజాగా రుద్రం-1 క్షిపణిని లాంచ్ చేసింది. ఒడిశాలోని బాలాసోర్ కేంద్రంగా శుక్రవారం ప్రయోగించిన రుద్రం-1 క్షిపణి సక్సెస్ అయ్యిందని డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు తెలిపారు.

రుద్రం-1 విజయవంతం కావడంతో శత్రుదేశాల రాడార్లను మట్టి కరిపించగల శక్తి భారత్ కైవసం చేసుకుందని తెలుస్తోంది. ఇది సుఖోయ్-30 ఎంకేఐ విమానం నుంచి ప్రయోగించగలిగే మిస్సైల్ అని.. శత్రుదేశాల గగనతల రక్షణ వ్యవస్థను దెబ్బతీసే సామర్థ్యం దీని సొంతమని శాస్త్రవేత్తలు వెల్లడించారు. కనిష్టంగా 500 మీటర్లు, గరిష్టంగా 15 కిలోమీటర్లు ఎత్తు నుంచి దీనిని ప్రయోగించవచ్చు. రుద్రం-1 భారతదేశపు మొదటి యాంటీ రేడియేషన్ మిస్సైల్ కానున్నదని రక్షణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రయోగం సక్సెస్ కావడంపై రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేస్తూనే.. డీఆర్డీవో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.

Tags:    

Similar News