ఆర్‌టీజీఎస్ సేవలు 24 గంటలు
దిశ, వెబ్‌డెస్క్: రియల్ టైం గ్రాస్ సెటిల్‌మెంట్(RTGS)కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త ప్రకటించింది. ఆర్‌టీజీఎస్ సేవలను ఇకమీదత వారంలో ప్రతిరోజూ 24 గంటలూ అందుబాటులో ఉండనున్నట్టు ఆర్‌బీఐ శుక్రవారం వెల్లడించింది. ఈ వెసులుబాటు డిసెంబర్ నుంచి అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం..నెలలో రెండు, నాలుగో శనివారం,ఆదివారం మినహాయించి మిగిలిన అన్ని పని దినాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు […]
దిశ, వెబ్‌డెస్క్: రియల్ టైం గ్రాస్ సెటిల్‌మెంట్(RTGS)కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త ప్రకటించింది. ఆర్‌టీజీఎస్ సేవలను ఇకమీదత వారంలో ప్రతిరోజూ 24 గంటలూ అందుబాటులో ఉండనున్నట్టు ఆర్‌బీఐ శుక్రవారం వెల్లడించింది. ఈ వెసులుబాటు డిసెంబర్ నుంచి అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం..నెలలో రెండు, నాలుగో శనివారం,ఆదివారం మినహాయించి మిగిలిన అన్ని పని దినాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నగదు బదిలీ అందుబాటులో ఉంది.
2019, డిసెంబర్ నుంచి నెఫ్ట్ సదుపాయాన్ని నిరంతరం అందుబాటులోకి తెచ్చిన క్రమంలోనే ఆర్‌బీఐ తాజా ప్రకటన ఇచ్చింది. నెఫ్ట్ వ్యవస్థను గతేడాది డిసెంబర్ నుంచి 24 గంటలూ తెచ్చిన తర్వాత సాఫీగా కొనసాగుతోందని, పెద్ద మొత్తంలో బదిలీకి ఉద్దేశించిన ఆర్‌టీజీఎస్ విధానం కూడా ఖాతాదారులకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ఆర్‌బీఐ వివరించింది.
నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ సదుపాయాలు రెండూ సత్వర నగదు బదిలీ చేసే సేవలు. సాధారణంగా ఆర్‌టీజీఎస్ విధానంలో రూ. 2 లక్షల వరకు బదిలీ చేయాల్సి ఉంటుంది. బ్యాంకులను బట్టి ఈ మొత్తంలో మార్పులుండవచ్చు. నెఫ్ట్ విధానంలో కనీస పరిమితి లాంటిదేమీ ఉండదు. మిగిలిన విధానాల కంటే తొందరగా నగదు బదిలీకి అవకాశం ఉండటమే నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ విధానాల ప్రత్యేకత. నెఫ్ట్ విధానంలో నగదు బదిలీ చేసిన గంటలోగా సదరు వ్యక్తి ఖాతాలోకి నగదు చేరిపోతుంది. ఆర్‌టీజీఎస్ విధానంలో తక్షణమే నగదు బదిలీ ఉంటుంది.