వచ్చిన ఆదాయం డీజిల్ ఖర్చులకే

దిశ, ముషీరాబాద్: కరోనా కష్టకాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్టీసీని ఆదుకోవాలని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ డిమాండ్ చేసింది. యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి మాట్లాడుతు.. మార్చి 22 నుంచి ఆర్టీసీ బస్సులు నడవని కారణంగా ఆర్టీసీ ఆదాయం పూర్తిగా పడిపోయిందన్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఆర్టీసీలో 49 వేల మందికి మూడు నెలలు కేవలం 50 శాతం జీతాలే చెల్లించారని తెలిపారు. ప్రస్తుతం కరోనా భయంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయడానికి ప్రయాణికులు భయపడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర […]

Update: 2020-07-20 10:35 GMT

దిశ, ముషీరాబాద్: కరోనా కష్టకాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్టీసీని ఆదుకోవాలని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ డిమాండ్ చేసింది. యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి మాట్లాడుతు.. మార్చి 22 నుంచి ఆర్టీసీ బస్సులు నడవని కారణంగా ఆర్టీసీ ఆదాయం పూర్తిగా పడిపోయిందన్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఆర్టీసీలో 49 వేల మందికి మూడు నెలలు కేవలం 50 శాతం జీతాలే చెల్లించారని తెలిపారు. ప్రస్తుతం కరోనా భయంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయడానికి ప్రయాణికులు భయపడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో బస్సులు నడపడం లేదని, వచ్చిన ఆదాయం డిజిల్ ఖర్చులకే సరిపోవడం లేదని ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన రియంబర్స్ మెంట్ వెంటనే చెల్లించాలని కోరారు.

Tags:    

Similar News