‘అద్దె బస్సు యజమానుల సమస్యల పరిష్కారానికి కృషి’
దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్టీసీ అద్దె బస్సుల యజమానుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చారు. శనివారం హైదరాబాద్‌లో ఎమ్మెల్సీని ఆర్టీసీ అద్దె బస్సుల యజమానుల సంక్షేమ సంఘం నాయకులు కలిశారు. తమ సమస్యలను ఎమ్మెల్సీకి విన్నవించారు. పరిష్కారానికి చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఎమ్మెల్సీ కవిత సమస్యలను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అద్దె బస్సుల యజమానుల […]
దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్టీసీ అద్దె బస్సుల యజమానుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చారు. శనివారం హైదరాబాద్‌లో ఎమ్మెల్సీని ఆర్టీసీ అద్దె బస్సుల యజమానుల సంక్షేమ సంఘం నాయకులు కలిశారు. తమ సమస్యలను ఎమ్మెల్సీకి విన్నవించారు. పరిష్కారానికి చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఎమ్మెల్సీ కవిత సమస్యలను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అద్దె బస్సుల యజమానుల సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీకి ప్రజాప్రతినిధుల కృతజ్ఞతలు
స్థానిక సంస్థల బలోపేతానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌ల గౌరవ వేతనాన్ని 30శాతం పెంచినందుకు వేములవాడ నియోజకవర్గానికి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు హైదరాబాద్‌లో ఎమ్మెల్సీని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వంలో జరగని విధంగా, టీఆర్ఎస్ హయాంలో గ్రామాల్లో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని స్థానిక ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.