లాక్‌డౌన్ ఎఫెక్ట్.. ఆర్టీసీ బస్సులు క్యాన్సిల్..!
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో లాక్‌డౌన్ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులపై మరో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో దాదాపు బస్సులను రద్దు చేశారు. హైదరాబాద్‌కు వచ్చే బస్సులను దాదాపుగా ఆపేస్తున్నారు. ఆయా కేంద్రం నుంచి సుమారు గంటల నుంచి గంటన్నర ప్రయాణం చేసి తిరిగి వచ్చే బస్సులకే అనుమతిస్తున్నారు. అంటే బస్‌డిపోల నుంచి దాదాపు 25 నుంచి 30 కిలోమీటర్ల వరకు బస్సులు తిరుగుతున్నాయి. ఇవ్వాల్టి నుంచి ఉదయం 10 దాటితే లాక్‌డౌన్ అమల్లోకి […]
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో లాక్‌డౌన్ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులపై మరో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో దాదాపు బస్సులను రద్దు చేశారు. హైదరాబాద్‌కు వచ్చే బస్సులను దాదాపుగా ఆపేస్తున్నారు. ఆయా కేంద్రం నుంచి సుమారు గంటల నుంచి గంటన్నర ప్రయాణం చేసి తిరిగి వచ్చే బస్సులకే అనుమతిస్తున్నారు. అంటే బస్‌డిపోల నుంచి దాదాపు 25 నుంచి 30 కిలోమీటర్ల వరకు బస్సులు తిరుగుతున్నాయి. ఇవ్వాల్టి నుంచి ఉదయం 10 దాటితే లాక్‌డౌన్ అమల్లోకి రానుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇతర జిల్లాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులను అధికారులు మొత్తంగా రద్దు చేశారు. కొన్నిచోట్ల హైదరాబాద్‌కు బస్సులు పంపించాలని ప్రయాణీకులు అడిగినా ఆర్టీసీ అధికారులు పట్టించుకోవడం లేదు. కరీంనగర్, వరంగల్ జిల్లా కేంద్రాల్లో ఆర్టీసీ తీరుపై పలువురు అసహనం వ్యక్తం చేస్తూ వాగ్వివాదానికి దిగుతున్నారు. అయినా బస్సులను బయటకు తీయడం లేదు.