రన్నింగ్‌లో ఊడిపోయిన ఆర్టీసీ బస్సు చక్రాలు.. చివరకు ఏం జరిగిందంటే?

దిశ ప్రతినిధి, నల్లగొండ: అది యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి – మోత్కూర్ ప్రధాన రహదారి. ఆ రహదారిపై ఓ ఆర్టీసీ బస్సు 40 మంది ప్రయాణికులతో వెళుతోంది. కొంతమంది ప్రయాణికులు పక్కవారితో.. మరికొంత మంది ప్రయాణికులు ఫోన్‌తో కాలక్షేపం చేస్తూ ప్రయాణం చేస్తున్నారు. డ్రైవర్ బస్సును ఓ మోస్తరు వేగంతో నడిపిస్తున్నారు. ఇంతలో ఒక్కసారిగా ఆ బస్సు భారీ కుదుపునకు లోనయ్యింది. బస్సులోని ప్రయాణికులు అంతా ఒక్కసారిగా ఉలిక్కపడ్డారు. ఒక్కనిమిషం పాటు ఏం జరిగిందో ఎవరికీ […]

Update: 2021-07-20 23:16 GMT

దిశ ప్రతినిధి, నల్లగొండ: అది యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి – మోత్కూర్ ప్రధాన రహదారి. ఆ రహదారిపై ఓ ఆర్టీసీ బస్సు 40 మంది ప్రయాణికులతో వెళుతోంది. కొంతమంది ప్రయాణికులు పక్కవారితో.. మరికొంత మంది ప్రయాణికులు ఫోన్‌తో కాలక్షేపం చేస్తూ ప్రయాణం చేస్తున్నారు. డ్రైవర్ బస్సును ఓ మోస్తరు వేగంతో నడిపిస్తున్నారు. ఇంతలో ఒక్కసారిగా ఆ బస్సు భారీ కుదుపునకు లోనయ్యింది. బస్సులోని ప్రయాణికులు అంతా ఒక్కసారిగా ఉలిక్కపడ్డారు. ఒక్కనిమిషం పాటు ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. కొన్ని క్షణాల పాటు ప్రయాణికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బస్సులోనే ఉండిపోయారు.

ఆ కుదుపు నుంచి తేరుకొని అసలేం జరిగిందోనని బస్సు నుంచి దిగి చూడగా, వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఆ ఆర్టీసీ బస్సు చక్రాలు రన్నింగ్‌లోనే ఊడిపోయాయి. తొర్రూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి తొర్రూరుకు 40 మంది ప్రయాణికులతో వెళుతోంది. సదరు బస్సు రాయగిరి- మోత్కూరు ప్రధాన రహదారిపై మోటకొండూరు మండలం కాటేపల్లి వద్దకు చేరుకోగానే.. బస్సు చక్రాలు పేర్లతో సహా ఊడిపోయి రోడ్డుపై పడిపోయాయి. బస్సు వేగం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీనితో ప్రయాణికులతో పాటు అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Tags:    

Similar News